2010లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను(T20 world cup schedule) సొంతం చేసుకున్న ఇంగ్లాండ్.. చివరగా 2016లో జరిగిన టోర్నీ ఫైనల్లో విండీస్ చేతిలో పోరాడి ఓడింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టులో మార్పులు జరిగాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో(2019 odi world cup winner) ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ ఆర్చర్, అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ స్టోక్స్ వివిధ కారణాలతో దూరమయ్యారు. అయినప్పటికీ ఇప్పుడీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తోంది. అందుకు ఆ జట్టు బలమైన బ్యాటింగే కారణం. గత కొన్నేళ్లలో అంతర్జాతీయ టీ20ల్లో(international t20 world cup 2021) మోర్గాన్ సేన అత్యంత శక్తిమంతమైన జట్టుగా ఎదిగింది. గత 11 టీ20 సిరీస్‌ల్లో ఆ జట్టు తొమ్మిది నెగ్గింది. ఓ సిరీస్ డ్రా చేసుకుని.. మరో దాంట్లో ఓడింది. కెప్టెన్ మోర్గాన్, బట్లర్, బెయిర్‌స్టో, రాయ్, మలన్.. ఇలాంటి బ్యాటర్లు ఉన్న బ్యాటింగ్ లైనప్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి లివింగ్‌స్టోన్ కూడా జతకావడం వల్ల ఆ జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో బ్యాట్‌తో సత్తాచాటిన మొయిన్ అలీ కూడా జోరుమీదున్నాడు. పేసర్లు మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్, జోర్డాన్, విల్లీతో పాటు నాలుగున్నరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మిల్స్ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. మరి వీళ్లలో తుది జట్టులో ఆడే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇక స్పిన్నర్లు రషీద్, అలీ.. వికెట్ల వేటకు సన్నద్ధమయ్యారు. అయితే టీ20 ప్రపంచకప్(t20 world cup venue 2021) జరిగే ఒమన్, యూఏఈలోని స్లో పిచ్‌లు ఇంగ్లాండ్‌కు కఠిన పరీక్ష పెట్టనున్నాయి. ఆ జట్టు టీ20 సిరీస్‌లను ఎక్కువగా ఫ్లాట్ పిచ్‌ల పైనే గెలుచుకుంది. ఈ ఏడాది భారత్‌లో నెమ్మదిగా స్పందించే పిచ్‌లపై జరిగిన సిరీస్‌లో ఓడిపోయింది. ఇటీవల ఐపీఎల్‌లోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. మరోవైపు మోర్గాన్ ఫామ్ కూడా జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి జట్లతో కలిసి గ్రూప్- 1లో ఉన్న ఇంగ్లాండ్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే సెమీస్ చేరగలదు.
కీలక ఆటగాళ్లు: మోర్గాన్, బెయిర్‌స్టో, బట్లర్, అలీ, రాయ్, మలన్
అత్యుత్తమ ప్రదర్శన: ఛాంపియన్ (2010)
ఇంగ్లాండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, బిల్లింగ్స్, బట్లర్, టామ్ కరన్, జోర్డాన్, లివింగ్‌స్టోన్, మలన్, మిల్స్, రషీద్, రాయ్, విల్లీ, వోక్స్, మార్క్‌వుడ్.
తొలి ముద్దు పెట్టాలని
ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్(new zealand world test championship) అడుగుపెడుతుందంటే అండర్‌డాగ్స్‌గా పరిగణించేవాళ్లు. కానీ గత రెండు (2015, 2019) వన్డే ప్రపంచకప్‌ల్లోనూ ఫైనల్లో ఓడిన ఆ జట్టు.. ఈ ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచి తనపై ఉన్న ఆ ముద్రను చెరిపేసుకుంది. గత కొంతకాలంగా దూకుడుకు సంయమనాన్ని జత చేసి నిలకడగా రాణిస్తోంది. ఇదే ఊపులో తొలి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో టోర్నీలో అడుగుపెట్టింది. ఆరంభ టీ20 ప్రపంచకప్ (2007)లో తొలిసారి సెమీస్ చేరిన కివీస్.. గత ప్రపంచకప్‌లో (2016) మరోసారి సెమీస్ వరకూ వెళ్లగలిగింది. టెస్టు ఛాంపియన్‌షిప్(test championship) రూపంలో దేశానికి తొలి ఐసీసీ టైటిల్‌ను అందించిన కెప్టెన్ విలియమ్సన్.. ఇప్పుడు ఈ టోర్నీలో జట్టును విజేతగా నిలిపి మొట్టమొదటి ప్రపంచకప్‌ను అందిస్తాడేమో చూడాలి. అతనే ఆ జట్టుకు కొండంత బలం. నాయకుడిగా తన ప్రశాంతమైన వ్యక్తిత్వంతో.. పదునైన వ్యూహాలతో జట్టును నడిపించే అతను.. బ్యాట్‌తోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో కాన్వే, గప్తిల్, నీషమ్, ఫిలిప్స్ కీలకం కానున్నారు. అరంగేట్రం నుంచి కాన్వే పరుగుల వేటలో దూసుకెళ్తున్నాడు. బౌలింగ్‌లో సీనియర్ పేస్ ద్వయం బౌల్ట్, సౌథీతో పాటు ఇటీవల ఐపీఎల్‌లో మెరిసిన ఫెర్గూసన్‌పై జట్టు ఆశలు పెట్టుకుంది. స్పిన్నర్లు శాంట్నర్, సోధి ప్రత్యర్థికి సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు. చాప్‌మన్, డారిల్, నీషమ్, జేమీసన్ రూపంలో జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం వీళ్లలో లేకపోవడం ప్రతికూల అంశం. మరోవైపు అనుభవజ్ఞులైన రాస్ టేలర్, ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్‌లు లేని ప్రభావం జట్టుపై పడే ఆస్కారముంది. ఇటీవల టీ20ల్లో కివీస్ ప్రదర్శన కూడా ఆశాజనకంగా లేదు. బంగ్లాదేశ్‌తో తొలిసారి ఆ జట్టు సిరీస్ కోల్పోయింది. విలియమ్సన్ మినహా స్పిన్‌ను సమర్థంగా ఆడే ఆటగాళ్లు లేకపోవడం సమస్యగా మారింది.
గ్రూప్- 2లో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్‌తో కలిసి ఉన్న న్యూజిలాండ్‌కు సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కీలక ఆటగాళ్లు: విలియమ్సన్, బౌల్ట్, సౌథీ, గప్తిల్, నీషమ్, ఫెర్గూసన్
అత్యుత్తమ ప్రదర్శన: సెమీస్ (2007, 2016)
న్యూజిలాండ్ జట్టు: విలియమ్సన్ (కెప్టెన్), టాడ్, బౌల్ట్, చాప్‌మన్, కాన్వే, ఫెర్గూసన్, గప్తిల్, జేమీసన్, డారిల్ మిచెల్, నీషమ్, ఫిలిప్స్, శాంట్నర్, సీఫర్ట్, సోధి, సౌథీ.
ఇదీ చూడండి: మెంటార్ ఆన్ డ్యూటీ.. పంత్‌కు ధోనీ కీపింగ్ పాఠాలు!