Syed Mushtaq Ali Trophy 2023 : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ - 2023లో భాగంగా తొలి రోజు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ హవా కనిపించింది. హరియానాతో జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానే(ముంబయి కెప్టెన్), బంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) రెచ్చిపోయి ఆడారు. తమ జట్టుకు విజయాన్ని అందించారు.
రహానే 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. రుతురాజ్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మెరుపు హాఫ్ సెంచరీలు బాది.. తమ జట్ల విజయాల్లో కీలకంగా నిలిచారు.
Syed Mushtaq Ali Trophy Mumbai Haryana Match : ముంబయి-హరియాణా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన హరియాణా 18 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 147 రన్స్ చేసింది. హర్షల్ పటేల్ (38), అంకిత్ (36), నిషాంత్ సంధు (30 నాటౌట్) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో తనుశ్ కోటియన్ (3-0-19-3), మోహిత్ అవస్తి (3-0-15-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. రహానే, శివమ్ దూబే (26 నాటౌట్) మంచిగా ఆడటం వల్ల 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హరియాణా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్, అన్షుల్ తలో వికెట్ తీశారు.
-
𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐨𝐟𝐟 𝐭𝐨 𝐚 𝐰𝐢𝐧𝐧𝐢𝐧𝐠 𝐬𝐭𝐚𝐫𝐭 👏
— BCCI Domestic (@BCCIdomestic) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Captain Ajinkya Rahane's match-winning knock of 76* (43) helps Mumbai beat Haryana by 8 wickets (D/L Method)#HARvMUM | #SMAT | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/jA8CWl5qma pic.twitter.com/WXrhSlVtgT
">𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐨𝐟𝐟 𝐭𝐨 𝐚 𝐰𝐢𝐧𝐧𝐢𝐧𝐠 𝐬𝐭𝐚𝐫𝐭 👏
— BCCI Domestic (@BCCIdomestic) October 16, 2023
Captain Ajinkya Rahane's match-winning knock of 76* (43) helps Mumbai beat Haryana by 8 wickets (D/L Method)#HARvMUM | #SMAT | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/jA8CWl5qma pic.twitter.com/WXrhSlVtgT𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐨𝐟𝐟 𝐭𝐨 𝐚 𝐰𝐢𝐧𝐧𝐢𝐧𝐠 𝐬𝐭𝐚𝐫𝐭 👏
— BCCI Domestic (@BCCIdomestic) October 16, 2023
Captain Ajinkya Rahane's match-winning knock of 76* (43) helps Mumbai beat Haryana by 8 wickets (D/L Method)#HARvMUM | #SMAT | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/jA8CWl5qma pic.twitter.com/WXrhSlVtgT
Syed Mushtaq Ali Trophy Bengal Maharashtra Match : బంగాల్-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. ఈ పోరులో మొదట బ్యాటింగ్కు దిగిన బంగాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం రుతురాజ్, కేదార్ జాదవ్ (40 నాటౌట్) మంచి ప్రదర్శనతో రాణించడం వల్ల.. మహారాష్ట్ర 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా విజయాన్ని అందుకుంది.
-
𝐑𝐮𝐭𝐮𝐫𝐚𝐣 𝐆𝐚𝐢𝐤𝐰𝐚𝐝 and 𝐀𝐣𝐢𝐧𝐤𝐲𝐚 𝐑𝐚𝐡𝐚𝐧𝐞 Starts off #SMAT in Style !! 🔥🦁
— Saravanan Hari 💛🦁🏏 (@CricSuperFan) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Ruturaj - 82(40) | 9 Fours | 5 Sixes
Rahane - 76*(43) | 6 Fours | 3 Sixes #RuturajGaikwad | #WhistlePodu | #Rahane
📸 via BCCI pic.twitter.com/S5MP7yxGmm
">𝐑𝐮𝐭𝐮𝐫𝐚𝐣 𝐆𝐚𝐢𝐤𝐰𝐚𝐝 and 𝐀𝐣𝐢𝐧𝐤𝐲𝐚 𝐑𝐚𝐡𝐚𝐧𝐞 Starts off #SMAT in Style !! 🔥🦁
— Saravanan Hari 💛🦁🏏 (@CricSuperFan) October 16, 2023
Ruturaj - 82(40) | 9 Fours | 5 Sixes
Rahane - 76*(43) | 6 Fours | 3 Sixes #RuturajGaikwad | #WhistlePodu | #Rahane
📸 via BCCI pic.twitter.com/S5MP7yxGmm𝐑𝐮𝐭𝐮𝐫𝐚𝐣 𝐆𝐚𝐢𝐤𝐰𝐚𝐝 and 𝐀𝐣𝐢𝐧𝐤𝐲𝐚 𝐑𝐚𝐡𝐚𝐧𝐞 Starts off #SMAT in Style !! 🔥🦁
— Saravanan Hari 💛🦁🏏 (@CricSuperFan) October 16, 2023
Ruturaj - 82(40) | 9 Fours | 5 Sixes
Rahane - 76*(43) | 6 Fours | 3 Sixes #RuturajGaikwad | #WhistlePodu | #Rahane
📸 via BCCI pic.twitter.com/S5MP7yxGmm
ODI World Cup 2023 Semi Final : సెమీస్ రేస్.. లెక్క తప్పింది సార్.. వేడి రాజుకుంది!
Australia Vs Sri lanka World Cup 2023 : ఎట్టకేలకు బోణీ కొట్టిన కంగారూలు.. శ్రీలంక హ్యాట్రిక్ ఓటమి