ఆస్ట్రేలియాలో ప్రాక్టిస్ సెషన్ మొదలుపెట్టి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు తెలిపాడు భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. "ఇక్కడికి వచ్చి సాధన చేసేందుకు నేను చాలా ఎదురుచూశాను. మైదానంలోకి అడుగుపెట్టి.. నడిచి.. పరిగెత్తి.. ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొన్నాను. ఇక్కడి వికెట్‌పై పేస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాను. వికెట్ బౌన్స్‌ను చూడాలనుకొన్నాను. తొలి నెట్ సెషన్ అద్భుతంగా ఉంది." అని తన అనుభూతిని చెప్పాడు.
ఇక ఆసీస్ పిచ్‌లపై సాధన గురించి మాట్లాడుతూ "సాధారణంగా నిదానంగా మొదలుపెడతాం. ఆత్రుత, ఉత్సుకత ఉంటుంది. అదే సమయంలో ఈ వాతావరణానికి నిన్ను నువ్వు ఎట్లా అలవర్చుకొంటున్నావో చూసుకోవాల్సి ఉంటుంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అదే సమయంలో నా ప్రాక్టిస్ రొటీన్‌ను అక్కడ అనుసరించడం చాలా కీలకం" అని వివరించాడు. నెట్‌సెషన్‌పై సూర్య స్పందిస్తూ.. "పిచ్‌పై బౌన్స్ ఉన్నట్లు సాధన సమయంలో గమనించాను. వికెట్‌పై పేస్.. ఆస్ట్రేలియాలో గ్రౌండ్ కొలతలు గురించి చాలా మంది మాట్లాడుతారు. ఈ వికెట్లపై మంచి స్కోర్ సాధించడానికి అవసరమైన గేమ్‌ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి ఇవి చాలా కీలకం" అని విశ్లేషించాడు.
ఇదీ చూడండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నాదల్ భార్య