Suryakumar Injury Update: టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. రీసెంట్గా సూర్య నెట్స్‌లో కాసేపు ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. 'బేబీ స్టెప్స్, ఇంకా పని పూర్తి కాలేదు' అని స్టోరీకి ట్యాగ్ రాశాడు. ఇక మూడు రోజుల క్రితం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను కూడా సూర్య పోస్ట్ చేశాడు.
అయితే టీమ్ఇండియాకు టీ20ల్లో సూర్య అత్యంత కీలకమైన ప్లేయర్. ఇటీవల వన్డే వరల్డ్‌కప్ తర్వాత టీ20ల్లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. అతడి నాయకత్వంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా 4-1 తేడాతో నెగ్గింది. ఇక డిసెంబర్లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య రెండోసారి టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా, రెండోది సౌతాఫ్రికా, ఆకరి టీ20 టీమ్ఇండియా నెగ్గింది. దీంతో సిరీస్ డ్రా గా ముగిసింది. ఇక 2024 టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియాకు మిడిలార్డర్లో సూర్య కీలకం. అలాగే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అప్పటిలోగా గాయం నుంచి కోలుకోకపోతే రోహిత్ శర్మతోపాటు సూర్య పేరును కూడా కెప్టెన్‌గా పరిశీలించే ఛాన్స్ ఉంది.
-
Great news for India and Mumbai Indians:
— Sahib Singh (@singh28915) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
-Suryakumar Yadav is back in the nets, getting ready for action! 🏏🇮🇳 #CricketUpdate #SuryakumarYadav #wintervolliefde #Hanuman #MumbaiIndians #BBL13 #IndianCricketTeam #PAKvsNZ #NZvsPAK pic.twitter.com/D3yIK4Ss4p
">Great news for India and Mumbai Indians:
— Sahib Singh (@singh28915) January 12, 2024
-Suryakumar Yadav is back in the nets, getting ready for action! 🏏🇮🇳 #CricketUpdate #SuryakumarYadav #wintervolliefde #Hanuman #MumbaiIndians #BBL13 #IndianCricketTeam #PAKvsNZ #NZvsPAK pic.twitter.com/D3yIK4Ss4pGreat news for India and Mumbai Indians:
— Sahib Singh (@singh28915) January 12, 2024
-Suryakumar Yadav is back in the nets, getting ready for action! 🏏🇮🇳 #CricketUpdate #SuryakumarYadav #wintervolliefde #Hanuman #MumbaiIndians #BBL13 #IndianCricketTeam #PAKvsNZ #NZvsPAK pic.twitter.com/D3yIK4Ss4p
ఇక సౌతాఫ్రికా పర్యటనలో జొహెన్నస్‌బర్గ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య గాయపడ్డాడు. కాలి చీలమండల గాయం కారణంగా ఆరు వారాల విశ్రాంంతి అవసరమని డాక్టర్లు సూచిండం వల్ల సూర్య ఆటకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం సూర్య వర్కవుట్లు చూస్తుంటే, అతడిని అతి త్వరలోనే మైదానంలో చూసే అవకాశం ఉంది.
Surya Kumar Yadav T20 Ranking: సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సూర్య 887 రేటింగ్స్‌లో టాప్‌లో ఉండగా, ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ 802 రేటింగ్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్య తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (674 రేటింగ్స్) ఒక్కడే టీమ్ఇండియా నుంచి టాప్ 10లో ఉన్నాడు.
ఎవరూ టచ్ చేయనంత దూరంలో సూర్య- 2024 వరల్డ్‌కప్ దాకా పొజిషన్ సేఫ్!- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్