ETV Bharat / sports

Surya Wear Samson Jersey : శాంసన్ జెర్సీలో సూర్య.. సంజూ ఎక్కడన్న ఫ్యాన్స్​కు అదిరిపోయే రిప్లై

author img

By

Published : Jul 28, 2023, 10:59 PM IST

Surya Wear Samson Jersey : విండీస్​తో తొలి వన్డేలో సుర్యకుమార్, శాంసన్ జెర్సీలో గ్రౌండ్​లో దిగాడు. అయితే సూర్య ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. శాంసన్​ ఎక్కడా అంటూ స్టేడియంలోని అతడి ఫ్యాన్స్ అరిచారు. దీంతో వారికి సూర్య ఏమని సమాధానం ఇచ్చాడంటే!

suryakumar yadav samson jersey
శాంసన్ జెర్సీలో సూర్య

Surya Wear Samson Jersey : వెస్టిండీస్​తో మొదటి వన్డేలో టీమ్ఇండియా బ్యాటర్ సూర్య కుమార్.. సంజూ శాంసన్ జెర్సీలో కనిపించాడు. మైదానంలో సడెన్​గా శాంసన్​ జెర్సీని చూసి సుంజూనే వచ్చాడా అనుకున్నారు. కానీ ఆ జెర్సీలో ఉన్న సూర్యను చూసి.. శాంసన్ ఫ్యాన్స్ కన్​ఫ్యూజ్​కు గురయ్యారు.

మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో బౌండరీ లైన్​ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యను.. శాంసన్ ఎక్కడా అని అభిమానులు అడిగారు. దీంతో వారి అరుపులకు స్పందించిన సూర్య వారి వైపు తిరిగి.. రెండు చేతులతో హార్ట్​ షేప్​లో శాంసన్ తన గుండెల్లో ఉన్నట్లుగా చూపాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్​గా మారింది. ఇక సూర్య, శాంసన్ జెర్సీ ఎందుకు ధరించాడో మ్యాచ్ అనంతరం టీమ్ మేనేజ్​మెంట్​ క్లారిటీ ఇచ్చింది.

అయితే సూర్యకుమార్​కు అందజేసిన జెర్సీ సైజ్​ మారిందట. అతడి సైజ్ జెర్సీ అందుబాటులో లేకపోవడం వల్ల.. సూర్య, శాంసన్ జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చాడని మేనేజ్​మెంట్ స్పష్టం చేసింది. అయితే సహచర ఆటగాళ్ల జెర్సీ ధరించడం సూర్యకు కొత్తేమీ కాదు. గతంలో కూడా విండీస్​తో జరిగిన టీ20 మ్యాచ్​లో సూర్య.. పేస్ బౌలర్ అర్షదీప్ సింద్ జెర్సీని ధరించాడు. కాగా ఈ పర్యటనలో టీ20 జట్టుకు ఎంపికైన వారితో సూర్య జెర్సీని పంపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ మ్యాచ్​లో వన్ డౌన్​లో వచ్చిన సూర్య.. మొదట్లో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. తర్వాత మూడు ఫోర్లు.. ఓ సిక్స్ బాది టచ్​లోకి వచ్చాడనుకునేలోపే 19 పరుగులకే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. మరోవైపు శాంసన్​ను కాదని, సూర్యను జట్టులోకి తీసుకోవడం వట్ల నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వన్డేల్లో పదే పదే సూర్య కుమార్ ఫెయిలవుతున్నా.. ఎందుకు అతడికి ఇన్ని ఛాన్స్​లు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో మండిపడ్డారు.

Ind vs Wi Odi : స్వల్ప లక్ష్యానికే టీమ్ఇండియా ఐదు వికెట్లు కోల్పోవడం వట్ల క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఫామ్​లో లేని విండీస్ జట్టుపైనే ఇంతలా కష్టపడితే.. ప్రపంచకప్​లో పెద్ద పెద్ద జట్లను ఎలా ఎదుర్కొంటారని ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ మ్యాచ్​లో భారత్ 115 పరుగులను ఛేదించేందుకు 22.5 ఓవర్లు ఆడి ఐదు వికెట్లు కోల్పోయింది.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.