ETV Bharat / sports

సూర్య భాయ్​ జోరు.. ప్రపంచ ర్యాంకింగ్స్​లో దూకుడు.. నెం.1 దిశగా.. - సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్​

Surya T20 rankings: వెస్టిండీస్​తో మూడో టీ20తో అదరగొట్టిన టీమ్​ఇండియా ప్లేయర్​ సూర్యకుమార్​ యాదవ్​.. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్​లోనూ దుమ్మురేపాడు. ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు.

Surya kumar yadav spots 2nd place latest ICC T20 rankingsEtv Bharat
సూర్యకుమార్​ యాదవ్​ టీ20 ర్యాంకింగ్స్​
author img

By

Published : Aug 3, 2022, 4:04 PM IST

Surya T20 rankings: టీమ్ఇండియా మిస్టర్ 360​ సూర్యకుమార్​ యాదవ్​.. వెస్టిండీస్​తో జరిగిన మూడో టీ20తో పాటు ఐసీసీ ర్యాంకుల్లోనూ అదరగొట్టేశాడు. ఇక అతడి నెక్ట్స్​ టార్గెట్​ బాబార్ అజామ్​ స్థానానికి ఎసరు పెట్టడమే. ఎందుకంటే తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో సూర్య రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండు స్థానాలు ఎగబాకి 2వ ర్యాంకులో నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ బాబర్ అజామ్​ నుంచి అతను కేవలం 2 పాయింట్ల దూరంలో ఉండటం విశేషం. మూడో టీ20లో సూర్య.. 44 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుత ఇన్నింగ్స్​ ఆడటం వల్ల అతడు ఐసీసీ ర్యాంకింగ్స్​లో ఈ ఘనత సాధించినట్లైంది.

ఇక వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూర్య ఇదే ఊపు కొనసాగిస్తే.. నంబర్ వన్ ర్యాంక్ సాధించడం పెద్ద కష్టమేమి కాదు. ఈ ఘనత సాధిస్తే.. ఐసీసీ పురుషుల క్రికెట్ ర్యాంకింగ్స్​లో విరాట్ కోహ్లీ తర్వాత ఈ అగ్ర పీఠాన్ని అధిరోహించబోయేది ఇతడే అవుతాడు! ఇంకా తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో పాకిస్థాన్​కు చెందిన మహ్మద్ రిజ్వాన్ 794 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా బ్యాటర్ మర్​క్రమ్​ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్​లో సూర్య మినహా మిగిలిన ఏ భారత బ్యాటర్ కూడా టాప్-10లో లేరు. సూర్య తర్వాత ఇషాన్ కిషన్ 14వ స్థానంలో ఉండగా.. రోహిత్​ శర్మ 16వ స్థానంలో కొనసాగుతున్నారు.

టీ20లో బౌలర్ల ర్యాంకింగ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హెజిల్​వుడ్​ 792 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంషీ, రషీద్ ఖాన్, అదిల్ రషీద్, అకీల్ హాసిన్, వనిందు హసరంగలు ఉన్నారు. వీరిలో హెజిల్​వుడ్​ మినహా మిగిలినవారంతా స్పిన్నర్లే కావడం విశేషం.

ఇదీ చూడండి: Commonwealth games: 'మా విజయం.. వారిలో మరింత విశ్వాసాన్ని నింపుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.