ETV Bharat / sports

Gavaskar:​ 'అందుకే కోచ్​గా చేయలేదు' - సునీల్ గావస్కర్​ టీమ్​ఇండియా కోచ్​

ఎంతో మంది ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్(Gavaskar)​.. కెరీర్​లో కోచ్​గా ఎందుకు వ్యవహరించలేదు కారణాన్ని వివరించారు. సచిన్​, ద్రవిడ్​, వీవీఎస్​ లక్ష్మణ్​, గంగూలీతో కలిసి ఆటకు సంబంధించిన విషయాలను పంచుకోవడం, సలహాలు ఇవ్వడం, దానిపై చర్చించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు.

Sunil Gavaskar
గావస్కర్
author img

By

Published : Jun 6, 2021, 10:09 PM IST

ఎన్నో రికార్డులను సాధించిన భారత దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్(Gavaskar)​.. తనదైన శైలి ఆటతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆటకు సంబంధించిన మెలకువలను, విలువైన సలహాలను ఇస్తూ ఇప్పటికీ ఎంతో మంది క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచిన అతడు.. కామెంటేటర్​గానూ సేవలందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. తన కెరీర్​లో జాతీయ జట్టుకు ఎందుకు కోచ్​గా వ్యవహరించలేదో వెల్లడించాడు.

"నేను మైదానంలో ఆడేటప్పుడు సహా మిగతా సమయాల్లోనూ క్రికెట్​ను చాలా ఎక్కువగా చూస్తాను, గమనిస్తాను. అయితే ఒక్కసారి అందులో నుంచి బయటకు వస్తే మాత్రం అడపాదడపా చూస్తాను. మిగతా వ్యాపకాలతో కొంచెం బిజీ అయిపోతాను. జీఆర్​ విశ్వనాథ్​ లేదా మాధవ్​ మంత్రిలా ప్రతి బంతిని క్షుణ్ణంగా పరిశీలించలేను. ఒకవేళ కోచ్​ లేదా సెలక్టర్​ అవ్వాలని అనుకుంటే మ్యాచ్​లోని ప్రతిబంతిని క్షుణ్ణంగా గమనించగలగాలి. అయినా నేనెప్పుడు కోచ్​ అవ్వాలని అనుకోలేదు"

-గావస్కర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

దిగ్గజ క్రికెటర్లు సచిన్​ తెందుల్కర్(Sachin)​, రాహుల్​ ద్రవిడ్(Dravid)​, వీవీఎస్​ లక్ష్మణ్(VVS Laxman)​, గంగూలీతో(Ganguly) కలిసి ఆటకు సంబంధించిన విషయాలను పంచుకోవడం, సలహాలు ఇవ్వడం, దానిపై చర్చించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు గావస్కర్​.

"నా దగ్గరకు వచ్చిన చాలా మంది ఆటగాళ్లకు ఆటకు సంబంధించి విలువైన సలహాలు ఇచ్చాను. సచిన్​, ద్రవిడ్​, గంగూలీ, సెహ్వాగ్​, లక్ష్మణ్​లతోనూ నా ఆలోచనలను పంచుకోవడం, వారితో కలిసి చర్చించడం ఎంతో సంతోషంగా ఉంది. నా వంతుగా సలహాలు, మెలకువలు ఎంతో మందికి చెబుతూనే ఉన్నాను. కానీ పూర్తిస్థాయిలో కోచ్​ కావలనుకోలేదు" అని గావస్కర్​ చెప్పాడు.

ఇదీ చూడండి Yuvaraj: 'టీమ్​ఇండియాకు అది మైనస్.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.