విశాఖ వేదికగా మార్చి 19న ఆసీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు కంగారూల చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసే సమయంలో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతిని కెప్టెన్ స్టీవ్ స్మిత్ గాల్లోకి ఎగిరి మరీ క్యాచ్ పట్టాడు. ఇక ఈ క్యాచ్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే స్మిత్ క్యాచ్ పట్టగానే కామెంటరీ బాక్స్ నుంచి సంజయ్ మంజ్రేకర్ దీన్ని 'క్యాచ్ ఆఫ్ ది సెంచరీ'గా పేర్కొన్నాడు.
కాగా, ఈ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. అనంతరం ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యన్ని సునాయాసంగా ఛేదించింది. ఇక ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్‌కు కేవలం మూడు బంతులు మాత్రమే వేసిన స్టార్క్ అతడ్ని పరుగులు తీయకుండా కట్టడి చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో బంతి పాండ్యా బ్యాట్‌కు టచ్ అయి స్లిప్స్‌లో ఉన్న స్మిత్ వైపు వెళ్లింది. అయితే ఆ బాల్ స్మిత్‌కు చాలా దూరం నుంచి వెళ్లేలా కనిపించింది. కానీ అనూహ్యంగా అతడు గాల్లోకి జంప్ చేసి మరీ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో కేవలం మూడు బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు హార్దిక్.
క్యాచ్ ఆఫ్ ది ఇయర్
స్టీవ్ స్మిత్ అద్భుత క్యాచ్‌ను చూసిన స్టేడియంలోని ప్రతి ఒక్కరు నోరెళ్లబెట్టారు. ఈ నేపథ్యంలో స్మిత్ క్యాచ్‌కు ఫిదా అయినవారు అతడ్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ స్మిత్ పట్టిన క్యాచ్‌ను 'క్యాచ్ ఆఫ్ ది ఇయర్'గా అభివర్ణించాడు.
-
#SteveSmith catch of century Smithy you beauty 🔥🔥 pic.twitter.com/LQkuNvNQJO
— Zaheer Khan (@ZaheerK30866428) March 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#SteveSmith catch of century Smithy you beauty 🔥🔥 pic.twitter.com/LQkuNvNQJO
— Zaheer Khan (@ZaheerK30866428) March 19, 2023#SteveSmith catch of century Smithy you beauty 🔥🔥 pic.twitter.com/LQkuNvNQJO
— Zaheer Khan (@ZaheerK30866428) March 19, 2023
అయితే మ్యాచ్ జరిగిన అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడాడు. "కొత్త బాల్‌తో స్టార్క్ భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చాడు. మ్యాచ్ ఆరంభం బాగుంది. వికెట్ ఎలా ఉంటుందో ముందుగానే అంచనా వేయలేకపోయాం. మా నైపుణ్యంతో భారత ఆటగాళ్లపై ఒత్తిడి తేవాలని అనుకున్నాం. ఆ విధంగానే మా ఆడి విజయం సాధించాం. ఛేదనలో హెడ్, మార్ష్ రాణించారు. మొదటి వన్డే మ్యాచ్‌లోనూ మార్ష్ విజృంభించాడు. కానీ, గెలవలేకపోయాం. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి గెలుపును మా ఖాతాలో వేసుకున్నాం. ఇక నేను సింగిల్ హ్యాండ్‌తో డైవ్ చేసి మరీ క్యాచ్ పట్టడం అద్భుతం. దీన్ని క్యాచ్ ఆఫ్ ది సెంచరీ అని అనుకోవడానికి వీల్లేదు. హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ఆటగాడిని పరుగులు ఇవ్వకుండా పెవిలియన్ చేర్చడం సంతోషంగా ఉంది" అని స్మిత్ అన్నాడు. ఇక మూడు వన్డేల పోరులో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచాయి. సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. చివరి మ్యాచ్ మార్చి 22న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.