టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. చరిత్ అసలంక (80; 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రాజపక్స (53; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడటం వల్ల బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని లంక 18.5 ఓవర్లలోనే ఛేదించింది.
లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. కుశాల్ పెరీరా (1)ని నసూమ్ పెవిలియన్‌కి పంపాడు. తర్వాత వచ్చిన అసలంక.. ఓపెనర్ నిశాంక (24)తో కలిసి ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. ముఖ్యంగా అసలంక ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, షకీబ్ వేసిన తొమ్మిదో ఓవర్లో నిశాంక, ఫెర్నాండో (0) ఔటయ్యారు. తర్వాతి ఓవర్లోనే హసరంగ (6) కూడా పెవిలియన్ చేరాడు. మహ్మదుల్లా వేసిన 14 ఓవర్‌లో అసలంక రెండు సిక్సర్లు బాదాడు. సైఫ్‌ఉద్దీన్ వేసిన 16 ఓవర్లో రాజపక్స చెలరేగి ఆడాడు. ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదేయడం వల్ల శ్రీలంక విజయం ఖరారైపోయింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ హల్ హసన్, సైఫ్‌ఉద్దీన్ రెండు వికెట్లు తీయగా.. నసూమ్ వికెట్ పడగొట్టాడు.
ఇదీ చదవండి: