Spinners In Super Over: భారత్- అఫ్గానిస్థాన్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. ఇరుజట్లు పోటాపోటీగా తలపడిన వేళ రెండో సూపర్ ఓవర్లో టీమ్ఇండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (121) బాదిన హిట్‌మ్యాన్, రెండు సూపర్ ఓవర్లలో కలిపి 7 బంతుల్లో 25 పరుగులతో సత్తా చాటాడు.
అయితే భారత్ విజయంలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పవచ్చు. అయితే సాధారణంగా సూపర్ ఓవర్లో పేసర్లే బౌలింగ్ చేస్తారు. ఈ మ్యాచ్‌లోనూ అఫ్గానిస్థాన్ రెండుసార్లు, టీమ్ఇండియా ఒకసారి పేసర్లనే బరిలోకి దింపింది. స్పిన్నర్లకు సూపర్ ఓవర్ బౌలింగ్ ఇచ్చేందుకు కోచ్/ కెప్టెన్ పెద్దగా ఆసక్తి చూపరు. అయితే బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం రోహిత్ శర్మ బంతిని బిష్ణోయ్‌కి అప్పగించి మ్యాచ్‌లో ఫలితం సాధించాడు. ఇలా టీ20 సూపర్ ఓవర్లలో తమ జట్టును గెలిపించిన స్పిన్నర్లెవరో చూసేద్దాం.
- రవి బిష్ణోయ్ vs అఫ్గానిస్థాన్ (2024): రెండో సూపర్ ఓవర్లో అఫ్గాన్ టార్గెట్ 12 పరుగులే. అయినా రోహిత్, బిష్ణోయ్‌తో బౌలింగ్ వేయించాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. కానీ, బిష్ణోయ్ తొలి మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను గెలిపించాడు.
- మహీష్ తీక్షణ vs న్యూజిలాండ్ (2023): శ్రీలంక స్పిన్నర్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ ఓవర్లో బౌలింగ్ చేశాడు. తీక్షణ ఈ సూపర్ ఓవర్లో కేవలం 8 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం శ్రీలంక 9 పరుగులు చేసి మ్యాచ్‌లో విజయం సాధించింది.
- ఇమ్రాన్ తాహిర్ vs శ్రీలంక (2019): 2019లో శ్రీలంక టీ20 సిరీస్కోసం సౌతాఫ్రికా వెళ్లింది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా 14 పరుగులు చేసింది. ఇక బంతి అందుకున్న ఇమ్రాన్ తాహిర్ శ్రీలంకను కట్టడి చేశాడు. అతడు కేవలం 5 పరుగులిచ్చి సౌతాఫ్రికాను గెలిపించాడు.
- సునీల్ నరైన్- కరీబియన్ ప్రీమియర్ లీగ్: 2014 సీపీఎల్ టోర్నీలో గుయానా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుతో జరిగిన సూపర్ ఓవర్లో నరైన్ ఎకంగా మెయిడెన్ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుయానా 11 పరుగులు చేసింది. తర్వాత నరైన్ ప్రత్యర్థి ట్రినిడాడ్‌ను ఒక్క పరుగు చేయకుండా కట్టడి చేసి, సూపర్ ఓవర్‌ను మెయిడెన్‌గా మలిచిన బౌలర్‌గా సంచలనం సృష్టించాడు.
- అక్షర్ పటేల్- ఇండియన్ ప్రీమియర్ లీగ్: 2021లో అక్షర్ పటేల్ దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన అక్షర్ దిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. వార్నర్, విలియమ్సన్‌ను కట్టడి చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం దిల్లీ 8 పరుగులు చేలి విజయం సాధించింది.
-
Ravi Bishnoi comes up trumps in the 2nd Super Over as #TeamIndia seals victory! 👌🔥#IDFCFirstBankT20ITrophy #GiantsMeetGameChangers #JioCinemaSports #INDvAFG #SuperOver pic.twitter.com/cUsqVMTrpH
— JioCinema (@JioCinema) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ravi Bishnoi comes up trumps in the 2nd Super Over as #TeamIndia seals victory! 👌🔥#IDFCFirstBankT20ITrophy #GiantsMeetGameChangers #JioCinemaSports #INDvAFG #SuperOver pic.twitter.com/cUsqVMTrpH
— JioCinema (@JioCinema) January 17, 2024Ravi Bishnoi comes up trumps in the 2nd Super Over as #TeamIndia seals victory! 👌🔥#IDFCFirstBankT20ITrophy #GiantsMeetGameChangers #JioCinemaSports #INDvAFG #SuperOver pic.twitter.com/cUsqVMTrpH
— JioCinema (@JioCinema) January 17, 2024
-
How did Narine bowl a maiden super over vs this Nicholas Pooran is still a mystery!pic.twitter.com/Rc5DSMpBqW
— Rᴀɪᴋᴀᴛ (@OverMidWicket) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">How did Narine bowl a maiden super over vs this Nicholas Pooran is still a mystery!pic.twitter.com/Rc5DSMpBqW
— Rᴀɪᴋᴀᴛ (@OverMidWicket) July 31, 2023How did Narine bowl a maiden super over vs this Nicholas Pooran is still a mystery!pic.twitter.com/Rc5DSMpBqW
— Rᴀɪᴋᴀᴛ (@OverMidWicket) July 31, 2023
షారుక్ ఖాన్, సునీల్ నరైన్ ఊచకోత.. టీ20ల్లో 'బ్లాస్ట్' పెర్ఫార్మెన్స్!
ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు కొత్త రూల్స్.. వర్షం పడితే సూపర్ ఓవర్