ETV Bharat / sports

Sourav Ganguly Security : దాదాకు భద్రత పెంపు.. కారణం అదేనా? - ganguly security upgraded

Sourav Ganguly Security : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీకి భద్రత పెంచనున్నట్లు ప్రకటించింది బంగాల్​​ ప్రభుత్వం నిర్ణయించింది.

Sourav Ganguly s security
Sourav Ganguly s security
author img

By

Published : May 17, 2023, 2:27 PM IST

Updated : May 17, 2023, 3:48 PM IST

Sourav Ganguly Security : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీకి భద్రత పెంచాలని బంగాల్​ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాకు ప్రస్తుతం ఉన్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో.. మమత సర్కార్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. దాదాకు 'వై' నుంచి 'జెడ్‌' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

'వై' కేటగిరీ భద్రత ప్రకారం.. గంగూలీ ఇంటి దగ్గర ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీస్​ అధికారులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్స్‌ అధికారులు ఉండేవారు. ఇప్పుడు 'జెడ్‌' కేటగిరీ భద్రత ప్రకారం.. ఇకపై దాదా భద్రత సిబ్బంది సంఖ్య ఎనిమిది నుంచి పది మంది పోలీసులు 24 గంటల పాటు ఉంటారు. ఈ మేరకు మంగళవారం.. రాష్ట్ర ఉన్నతాధికారులు బెహలాలోని గంగూలీ కార్యాలయానికి చేరుకొని స్థానిక పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.

కాగా ప్రస్తుతం బంగాల్​ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీమ్, మోలోయ్​కు జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. తాజాగా గంగూలీకి కూడా జెడ్​ ప్లస్ భద్రత అందించింది రాష్ట్ర ప్రభుత్వం. "గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్​లో తన జట్టు దిల్లీ క్యాపిటల్స్​తో బిజీగా గడుపుతున్నాడు. మే 21న కోల్‌కతాకు తిరిగి వస్తాడు. ఆ రోజు నుంచి గంగూలీకు జెడ్​ కేటగిరీ భద్రతను అందిస్తాము" అని పోలీసు అధికారి తెలిపారు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​లో గంగూలీ సేవలందిస్తున్న దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. సీజన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనను కనబరుస్తూ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం నాలుగు విజయాలే నమోదు చేసింది. దీంతో 8 పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది. దిల్లీ ఈ సీజన్‌లో పంజాబ్​ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్​లు దిల్లీకి నామమాత్రం కాగా..0​ పంజాబ్​కు కీలకం కానుంది.

దిల్లీ రెగ్యులర్‌ కెప్టెన్‌ రిషభ్​ పంత్‌ గతేడాది డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతడి స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించారు. బ్యాటింగ్​లో వార్నర్‌ ఫర్వాలేదనిపించినా... జట్టులోని సహచర ఆటగాళ్ల నుంచి అతడికి మద్దతు కరవైంది. అటు బ్యాటింగ్​లో, ఇటు బౌలింగ్​లో పూర్తిగా విఫలమైన దిల్లీ వచ్చే సీజన్​లో అయినా రాణించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి: IPL 2023 LSG VS MI : పాపం చీర్​గర్ల్స్​​.. ముంబయి చేసిన పనికి బాగా ఏడ్చేశారు!

Last Updated : May 17, 2023, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.