ETV Bharat / sports

Syed Mushtaq Ali Trophy: వరుసగా రెండోసారి విజేతగా తమిళనాడు - సయ్యద్​ ముస్తక్​ అలీ ట్రోఫీ

సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీని ముద్దాడింది తమిళనాడు. సోమవారం జరిగిన ఫైనల్​లో కర్ణాటకపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తమిళనాడు.. వరుసగా రెండో టైటిల్​ను కైవసం చేసుకుంది. ఆఖరి బంతికి సిక్సర్​ బాది జట్టు​ విజయంలో కీలకంగా వ్యవహరించాడు షారుక్​ ఖాన్​(33*).

sharukh khan
షారుక్​ ఖాన్​
author img

By

Published : Nov 22, 2021, 4:52 PM IST

Updated : Nov 22, 2021, 5:20 PM IST

సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ ఫైనల్​లో తమిళనాడు విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. దిల్లీ వేదికగా కర్ణాటకతో జరిగిన టీ20 మ్యాచ్​లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 152 పరుగుల లక్ష్య ఛేదనలో.. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సిక్స్​ బాది జట్టుకు టైటిల్​ను అందించాడు బ్యాట్స్​మన్​ షారుక్​ ఖాన్​(33*). ఈ విజయంతో టోర్నీ చరిత్రలో మూడో సారి కప్​ను అందుకుంది తమిళనాడు. అంతకుముందు 2006-07, 2020-21 సీజన్​లోనూ కప్​ను సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్​లో 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన తమిళనాడుకు శుభారంభం దక్కలేదు. హరి నిశాంత్​(23) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వికెట్​ కీపర్​ ఎన్​ జగదీశన్​(41) ఒక్కడే స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. సాయి సుదర్శన్​(9), కెప్టెన్​ విజయ్ శంకర్​(18), సంజయ్​ యాదవ్​(5), ఎం.మహ్మద్​(5) విఫలమయ్యారు. ఇక ఆఖరి ఓవర్​లో విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో షారుక్​ ఖాన్​ అదరగొట్టాడు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సిక్సర్​ బాది మ్యాచ్​ను ముగించాడు. కర్ణాటక బౌలర్లలో కరియప్పా 2, ప్రతీక్​ జైన్​, విద్యాధర్ పాటిల్​, కరుణ్ నాయర్​ చెరో వికెట్​ తీశారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కర్ణాటక నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగలు చేసింది. ఓపెనర్​ రోహన్​ కదమ్​(0) డకౌట్​ కాగా, కెప్టెన్ మనీశ్​ పాండే(13), కరుణ్​ నాయర్​(18), శరత్​(16) ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభినవ్​ మనోహర్​(46), ప్రవీన్​ దూబె(33) మంచి ఇన్నింగ్స్​ ఆడారు. చివర్లో వచ్చిన సుచిత్(18*) నాటౌట్​ నిలిచాడు. తమిళనాడు బౌలర్లలో సాయి కిశోర్​ 3, వారియర్​, సంజయ్​ యాదవ్​, నటరాజన్​ చెరో వికెట్​ దక్కించుకున్నారు.

ఇదీ చూడండి: కోర్నికోవా.. అందంతో కవ్వించే టెన్నిస్ భామ

Last Updated : Nov 22, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.