SL Vs Ban Asia Cup : ఆసియాకప్‌లో భాగంగా జరగనున్న మరో కీలక పోరుకు చూసేందుకు క్రికెట్ లవర్స్ సంసిద్ధంగా ఉన్నారు. సూపర్-4 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో.. బంగ్లాదేశ్ శనివారం పోటీపడనుంది. బరిలో ఉండాలంటే ఇక తప్పక నెగ్గాల్సిందే అనే పరిస్థితిలో బంగ్లా ఉంది. సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిని చవి చూసిన బంగ్లా.. ఇప్పుడు లంక చేతిలో చిత్తైతే ఇక ఆ జట్టుకు కష్ట కాలమే. అయితే పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసిన బంగ్లా.. ఈ సారి ఏమాత్రం విజృంభిస్తుందో చూడాలి.
మరోవైపు బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టును వెంటాడుతోంది. దీంతో అనుభవజ్ఞులైన షకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని బంగ్లా కోరుకుంటోంది. ఫామ్‌లో ఉన్న నజ్ముల్ శాంటో గాయం కారణంగా దూరమవ్వడం బంగ్లాను ఇంకాస్త దెబ్బ తీసింది. ఇక వన్డే ఫార్మాట్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న శ్రీలంక.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే అఫ్గానిస్థాన్‌తో జరిగిన గ్రూప్ ఆఖరి మ్యాచ్‌లో చివరిదాకా పోరాడి గెలుపు సొంతం చేసుకున్న లంక జట్టు.. బంగ్లాపైనా గెలిచి సూపర్-4లో శుభారంభం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
-
🇧🇩 Team Bangladesh is gearing up for their clash against 🇱🇰 Sri Lanka in the Super Four round of #AsiaCup2023.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🎟️ Grab your tickets at https://t.co/9abfJNKjPZ#SLvBAN pic.twitter.com/um8niEPeMl
">🇧🇩 Team Bangladesh is gearing up for their clash against 🇱🇰 Sri Lanka in the Super Four round of #AsiaCup2023.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 8, 2023
🎟️ Grab your tickets at https://t.co/9abfJNKjPZ#SLvBAN pic.twitter.com/um8niEPeMl🇧🇩 Team Bangladesh is gearing up for their clash against 🇱🇰 Sri Lanka in the Super Four round of #AsiaCup2023.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 8, 2023
🎟️ Grab your tickets at https://t.co/9abfJNKjPZ#SLvBAN pic.twitter.com/um8niEPeMl
SL Vs Ban Super 4 : ఇక ఈ మ్యాచ్‌లో నెగ్గితే వరుసగా అత్యధిక వన్డే విజయాల జాబితాలో శ్రీలంక (13) రెండో స్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతం లంక 12 విజయాలతో పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో సమానంగా ఉండగా. అయితే తొలి స్థానంలో ఆస్ట్రేలియా (21) ఉంది. ఎవరో ఒకరు కాకుండా జట్టు మొత్తం సమష్టిగా రాణిస్తుండటం వల్ల లంకకు ప్రధాన బలంగా మారుతోంది. బ్యాటింగ్‌లో కుశాల్ మెండిస్, బౌలింగ్‌లో పతిరన, తీక్షణ ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బంగ్లాపైనా వాళ్లు సత్తా చాటితే విజయం నల్లేరుపై నడకే. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
-
Bangladesh team practice in Colombo, Sri Lanka 🏏 🇧🇩
— Bangladesh Cricket (@BCBtigers) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Visual Credit – SLC#BCB | #cricket | #AsiaCup2023 pic.twitter.com/MdVikn7xdu
">Bangladesh team practice in Colombo, Sri Lanka 🏏 🇧🇩
— Bangladesh Cricket (@BCBtigers) September 8, 2023
Visual Credit – SLC#BCB | #cricket | #AsiaCup2023 pic.twitter.com/MdVikn7xduBangladesh team practice in Colombo, Sri Lanka 🏏 🇧🇩
— Bangladesh Cricket (@BCBtigers) September 8, 2023
Visual Credit – SLC#BCB | #cricket | #AsiaCup2023 pic.twitter.com/MdVikn7xdu
Asia Cup 2023 Sl vs Ban : తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. లో స్కోరింగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఈజీ విన్..