న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో(IND vs NZ T20 Series) భాగంగా బుధవారం(నవంబర్ 17) తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత జట్టు సారథి రోహిత్ శర్మ.. బౌలర్ సిరాజ్‌ను కొట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
కివీస్‌తో తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత బ్యాటర్లు రాణించినప్పటికీ చివరి ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది. అయితే.. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ పెవిలియన్ చేరాక డగౌట్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీవీ వైపు తీక్షణంగా చూస్తున్నారు. తమ పక్కనే కూర్చున్న సిరాజ్ మాత్రం పరధ్యానంలో ఉన్నాడు.
అదే సమయంలో డగౌట్లో ఉన్న సిరాజ్ వైపు కెమెరా మళ్లింది. సిరాజ్‌ను టీవీలో చూసిన రాహుల్.. తనకు ఏమైందన్నట్లు సీరియస్‌గా ఓ లుక్కిచ్చాడు. వెంటనే రోహిత్ శర్మ.. సిరాజ్ వెనకుంచి తలపై ఒక్కటిచ్చాడు. దీంతో సిరాజ్ పరధ్యానం నుంచి బయటకొచ్చి ఓ స్మైల్ పడేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. గతంలో హర్భజన్-శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.
-
Why did Rohit hit Siraj🤣🤣🙄#INDvNZ #RohitSharma pic.twitter.com/EjqnUXts3v
— Bhanu🔔 (@its_mebhanu) November 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Why did Rohit hit Siraj🤣🤣🙄#INDvNZ #RohitSharma pic.twitter.com/EjqnUXts3v
— Bhanu🔔 (@its_mebhanu) November 17, 2021Why did Rohit hit Siraj🤣🤣🙄#INDvNZ #RohitSharma pic.twitter.com/EjqnUXts3v
— Bhanu🔔 (@its_mebhanu) November 17, 2021
తొలి మ్యాచ్ భారత్‌దే..
జైపూర్ వేదికగా తొలి టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
సూర్యకుమార్ యాదవ్ (62), కెప్టెన్ రోహిత్ శర్మ (48) రాణించారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (15)తో కలిసి రోహిత్ అర్ధశతక భాగస్వామ్మం నిర్మించాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మరో అర్ధశతకం (59) జోడించారు.
రోహిత్ ఔటైనప్పటికీ సూర్యకుమార్ ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ కివీస్ బౌలర్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రిషభ్ పంత్ 12*, శ్రేయస్ అయ్యర్ 5, వెంకటేశ్ అయ్యర్ 4 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సౌథీ, డారిల్ మిచెల్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి:
బాబర్‌ను కాదని వార్నర్‌కే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'.. ఎందుకలా?