Shubman Gill ICC fine : టీమ్ఇండియా ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. పూర్తి మ్యాచ్ ఫీజును కోత విధిస్తూ.. 115 శాతం జరిమానా విధించింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో గిల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అంపైర్ నిర్ణయంతో గిల్ అసంతృప్తితో క్రీజును వీడాడు. అనంతరం అతడి ఔట్‌కు సంబంధించి ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో వ్యవహారం వివాదాస్పదమైంది. గిల్ క్రీడా నిబంధన 2.7కు విరుద్దంగా ప్రవర్తనా నియమావళి కోడ్‌ను ఉల్లంఘించాడని ఐసీసీ నిర్ధరించి జరిమానా వేసింది.
-
🚨 JUST IN: India, Australia and star opener sanctioned by the ICC.
— ICC (@ICC) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details ⬇️https://t.co/n1AVCUeVTm
">🚨 JUST IN: India, Australia and star opener sanctioned by the ICC.
— ICC (@ICC) June 12, 2023
Details ⬇️https://t.co/n1AVCUeVTm🚨 JUST IN: India, Australia and star opener sanctioned by the ICC.
— ICC (@ICC) June 12, 2023
Details ⬇️https://t.co/n1AVCUeVTm
కాగా అటు డబ్ల్యూటీసీ 2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమ్ఇండియాకు సైతం స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇక స్లో ఓవర్‌రేట్ కారణంగా టీమ్ఇండియా ఆటగాళ్లందరికీ పూర్తి మ్యాచ్ ఫీజులో కోత విధించింది ఐసీసీ. అటు డబ్ల్యూటీసీ 2023 విజేత ఆస్ట్రేలియా ప్లేయర్లకు సైతం ఇదే కారణంగా మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించింది.
ఐసీసీ నిబంధన నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం ఒక జట్టు నిర్ణిత సమయంలో బౌలింగ్ పూర్తి చేయడంలో విఫలమైతే.. ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారని ఐసీసీ తెలిపింది. ఈ లెక్కన టీమ్ఇండియా 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు ఆలస్యంగా ముగించాయి.
గిల్ క్యాచ్‌ఔట్ వివాదం.. టీమ్ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన గిల్‌ను.. బోలాండ్ క్యాచ్ ఔట్ చేశాడు. అయితే గ్రీన్ క్యాచ్ అందుకునే సమయంలో బంతి గ్రౌండ్‌ను తాకినట్టు అనిపించింది. దీంతో గిల్ రివ్యూ కోరాడు. రివ్యూ పరిశీలించిన థర్డ్ అంపైర్ కూడా గిల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఆశ్చర్యానికి గురైన గిల్ మైదానాన్ని వీడాడు. తాజాగా సోషల్ మీడియా అకౌంట్లో గిల్ తను ఔటైన విధానం గురించి ప్రస్తావిస్తూ థర్డ్ అంపైర్‌ను బహిరంగంగా విమర్శించినట్లు భావించిన ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
-
🔎🔎🤦🏻♂️ pic.twitter.com/pOnHYfgb6L
— Shubman Gill (@ShubmanGill) June 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🔎🔎🤦🏻♂️ pic.twitter.com/pOnHYfgb6L
— Shubman Gill (@ShubmanGill) June 10, 2023🔎🔎🤦🏻♂️ pic.twitter.com/pOnHYfgb6L
— Shubman Gill (@ShubmanGill) June 10, 2023
కామెరూన్ గ్రీన్ రియాక్షన్.. కామెరూన్ గ్రీన్ క్యాచ్‌ను ఉద్దేశించి స్టేడియంలోని ప్రేక్షకులు.. 'ఛీటర్, ఛీటర్.. మోసం.. మోసం" అంటూ మైదానం దద్దరిల్లేలా అరిచారు. దీనిపై కామెరూన్ స్పందించాడు. "అప్పుడు నేను సరిగ్గానే క్యాచ్ పట్టినట్లు భావించాను. క్లియర్ క్యాచ్‌నే అందుకుని పైకి విసిరా. ఇందులో నాకెలాంటి సందేహనం, అనుమానం అస్సలు కలగలేదు. అయితే.. ఇక్కడ నిర్ణయం థర్డ్ అంపైర్‌కు వెళ్లింది. అతడు ఈ క్యాచ్‌ను సరైనదిగా అంగీకరిస్తూ తన నిర్ణయం ప్రకటించాడు. స్లిప్స్‌లో క్యాచ్‌లను పట్టేందుకు నేను చాలా కష్టపడ్డాను. ఎప్పుటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉన్నాను" అని గ్రీన్ పేర్కొన్నాడు.
-
🤍 #WTC23 pic.twitter.com/oRXbLVoO0s
— Cameron Green (@CameronGreen_) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🤍 #WTC23 pic.twitter.com/oRXbLVoO0s
— Cameron Green (@CameronGreen_) June 11, 2023🤍 #WTC23 pic.twitter.com/oRXbLVoO0s
— Cameron Green (@CameronGreen_) June 11, 2023