అనుకున్నట్టే జరిగింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్ఇండియాకు ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. అతడు వెన్నుముక గాయంతో బాధపడుతున్నాడని బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో రజత్ పాటిదర్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. శ్రేయస్‌ను ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏకు పంపించనున్నట్లు తెలిసింది. అక్కడ వైద్యుల నిపుణుల సమక్షంలో రిహబిలిటేషన్ పొందుతాడు.
ఇకపోతే కొన్ని నెలలుగా శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్లు విఫలమైనప్పుడు అతడు బాగానే రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో టెస్టులు, వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. తన షార్ట్‌పిచ్ బంతుల బలహీనత నుంచి బయట పడుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవతరించాడు. ఇక ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లోనూ అతడు ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతడు గాయపడటం జట్టుకు ఎదురుదెబ్బ లాంటిది.
కాగా, న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఇందులో భాగంగానే ఇరు జట్లు తొలి వన్డే కోసం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఇకపోతే 21న రాయ్‌పుర్, 24న ఇండోర్‌లో మిగిలిన మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత 27, 29, ఫిబ్రవరి 1న టీ20 మ్యాచులు జరుగుతాయి.
ఇదీ చూడండి: బాబర్ ఆజంపై మరో సారి లైంగిక ఆరోపణలు.. తోటి క్రీడాకారుడి ప్రేయసితో..!