ETV Bharat / sports

మెగా వేలానికి సర్వం సిద్ధం- ఆ ప్లేయర్లపై కనకవర్షమేనా? - ఐపీఎల్ వార్తలు

IPL 2022: ఈ సారి ఐపీఎల్ మెగావేలంలో 590మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. కొత్తగా చేరిన రెండు ప్రాంఛైజీలతో కలిపి మొత్తం 10 జట్లు తమకు నచ్చిన ప్లేయర్ల కోసం రూ.కోట్లు కుమ్మరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ప్రాంఛైజీల వ్యూహం ఎలా ఉండబోతోంది? ఏ ఆటగాడిపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది? విదేశీ ఆటగాళ్లలో ఎవరికి భారీ డిమాండ్ ఉండబోతోంది? ఓసారి చూద్దాం.

IPL Auction 2022
ఐపీఎల్​ 2022 వేలం
author img

By

Published : Feb 11, 2022, 6:00 PM IST

IPL Auction 2022: ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. బెంగళూరులో శనివారం, ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త ప్రాంఛైజీలు గుజరాత్ టైటాన్స్, లఖ్​నవూ సూపర్​జియంట్స్​తో కలిపి ఈసారి మొత్తం 10 జట్లు వేలంపాటలో పాల్గొంటున్నాయి. 227 విదేశీ ఆటగాళ్లు సహా మొత్తం 590 మంది ప్లేయర్లు అందుబాటులో ఉంటున్నారు. తాము కావాలనుకునే ప్లేయర్​ను దక్కించుకునేందుకు ఎన్ని రూ.కోట్లయినా వెచ్చించేందుకు ప్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి వేలంలో ఏ ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తుంది? ఎవరి కోసం ప్రాంఛైజీలు పోటాపోటీగా పాట పాడుతాయి? విదేశీ ఆటగాళ్లలో ఎవరికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు ఓసారి చూద్దాం.

IPL 2022

అయ్యర్​, ఠాకూర్​లకు కాసుల పంట!

shrayas Iyyer
శ్రేయస్​ అయ్యర్​

టీమ్​ఇండియా డాషింగ్ బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​, ఆల్​రౌండర్​ శార్దుల్ ఠాకూర్​లపై ఈ మెగా వేలంలో కనకవర్షం కురిసే అవకాశాలున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే వీరు రికార్డు ధర పలికే ఛాన్స్​ పుష్కలంగా ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంచి కెప్టెన్ కావాలనుకునే ప్రాంఛైజీలు రూ.20 కోట్లు వెచ్చించైనా శ్రేయస్ అయ్యర్​ను సొంతం చేసుకుంటాయని చెబుతున్నారు. శార్దుల్ ఠాకూర్​, ఇషాన్​ కిషన్​(కీపర్​-బ్యాటర్​) రూ.12-15కోట్లు పలకవచ్చని పేర్కొన్నారు. 10 మందికిపైగా భారత ఆటగాళ్లు రూ.10-20కోట్ల మధ్య కొల్లగొట్టవచ్చన్నారు.

shardul thakur
శార్దుల్ ఠాకూర్​

దీపక్​ చాహర్​, యుజ్వేంద్ర చాహల్ కోసం కూడా ప్రాంఛైజీలు పోటీ పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ఇద్దరు బౌలర్లు రూ.15 కోట్ల వరకు దక్కించుకోవచ్చు.

దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని(సీఎస్​కే), విరాట్ కోహ్లీ(ఆర్​సీబీ), రోహిత్ శర్మ(ముంబై)లను ఆయా ప్రాంఛైజీలు రిటైన్ చేసుకున్నాయి. దీంతో నిఖార్సయిన మిడిల్​ ఆర్డర్స్ బ్యాటర్లు, మణికట్టు స్పిన్నర్లపై ఇవి దృష్టి సారిస్తాయి. అలాగే ఫుల్​ డిమాండ్​లో ఉండే ఆల్​రౌండర్ల కోసమూ పాట పాడనున్నాయి.

గతేడాది రిటెన్షన్​లో రూ.17కోట్ల అత్యధిక ధర పలికిన కేఎల్​ రాహుల్, దిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్​ శ్రేయస్ అయ్యర్​ కోసం పంజాబ్​ కింగ్స్​, సన్​రైజర్స్ హైదరాబాద్​, రాజస్థాన్ రాయల్స్​ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ ప్రాంఛైజీలకే బలమైన మిడిల్​ ఆర్డర్ బ్యాటర్లు, గేమ్​ ఛేంజర్స్​​ అవసరం ఎక్కువగా ఉంది. మయాంక్ అగర్వాల్, కేన్ విలియమ్సన్​ వంటి ఆటగాళ్లు అంచనాలను అందుకోకపోయినా ప్రత్యామ్నాయ ఆటగాడు ఉండాలని ఆయా ప్రాంఛైజీలు భావిస్తున్నాయి.

KL Rahul
కేఎల్ రాహుల్​

ప్రస్తుతం పంజాబ్​ పర్సులో రూ.72కోట్లు, సన్​రైజర్స్ హైదరాబాద్​ పర్సులో రూ.68కోట్లు, రాజస్థాన్ రాయల్స్​ పర్సులో రూ.62కోట్లు ఉన్నాయి. దీంతో తమకు కావాల్సిన ఆటగాడి కోసం ఎన్ని రూ.కోట్లయినా వెచ్చించే అవకాశం ఉంది.

IPL 2022 Players

వారిపైనే దృష్టి..

ధోని సారథ్యంలోని సీఎస్కే.. మ్యాచ్ విన్నర్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించనుంది. పంజాబ్​, రాజస్థాన్ ప్రాంఛైజీలు మాత్రం ఎప్పటిలాగే తాము కావాలనుకున్న ప్లేయర్ల కోసం రూ.కోట్లు గుమ్మరించనున్నాయి. కొత్త కెప్టెన్​ కోసం చూస్తున్న కోల్​కతా నైట్ రైడర్స్​ శ్రేయస్ అయ్యర్ కోసం ఇతర ప్రాంఛైజీలతో పోటాపోటీగా వేలంపాట పాడే అవకాశం ఉంది. అయితే వరుణ్​ చక్రవర్తిని రిటైన్ చేసుకున్న ఈ ప్రాంఛైజీ పర్సులో రూ.48కోట్లే మిగిలి ఉండటం, ఎక్కువమంది ఆటగాళ్లు కావాల్సి ఉండటం ప్రతికూలాంశంగా మారనుంది.

ప్రతిజట్టులో కనీసం 18 మంది ఆటగాళ్లు ఉండాల్సిన ఈ వేలం పాటులో ఒక్కో ప్రాంఛైజీ 22-25మంది ప్లేయర్లను తీసుకుంటుంది. అందుకే క్యాప్డ్​, అన్​క్యాప్డ్ ప్లేయర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈకారణంగానే గతేడాది ఐపీఎల్​ పర్పుల్ క్యాప్ విన్నర్​ హర్షల్ పటేల్ కనీస ధరను రూ.2కోట్లుగా నిర్ణయించారు. ఇంతకు ఐదు రెట్లు ఎక్కువ అతని దక్కే అవకాశాలున్నాయి. అలాగే స్పీడ్​ బౌలర్ ఆవేశ్ ఖాన్ బేస్ ప్రైజ్​ రూ.20లక్షలుగా ఉండగా.. అతను రూ.10కోట్ల వరకు పలకవచ్చు. అంటే బేస్​ ప్రైజ్​ కన్నా 50 రేట్లు ఎక్కువ.

సీనియర్లకూ రూ.కోట్లు..

సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానె కూడా రూ.7-8కోట్లు పలికే అవకాశాలున్నాయి. వీరి అనుభవం ఇందుకు ఉపయోగపడనుంది.​ సీనియర్ బౌలర్​ భువనేశ్వర్​ కుమార్, లెగ్ స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్ కూడా భారీ ధర కాకపోయినా మంచి ధరనే పలకవచ్చు.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుతంగా రాణించడమే గాక, విండీస్ సిరీస్​తో టీమ్​ ఇండియా అరంగ్రేటం చేసి ఆకట్టుకున్న దీపక్​ హుడా కోసం కూడా ప్రాంఛైజీలు పోటీ పడవచ్చు.

IPL Auction News

విదేశీ ఆటగాళ్లలో వీరికే డిమాండ్​..

david warner
డేవిడ్ వార్నర్​

భీకర ఫాంలో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్​ కోసం ఐపీఎల్ ప్రాంఛైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అతడి కోసం రూ.15కోట్లు వెచ్చించేందుకైనా యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. అతడు ఆటగాడు మాత్రమే కాకుండా కెప్టెన్​గా కూడా సేవలందిస్తాడని భావిస్తున్నాయి. వార్నర్ కెప్టెన్​గా 2016లో సన్​రైజర్స్​ను విజేతగా నిలిపాడు. అందుకే లఖ్​నవూ సూపర్​జియంట్స్​ వార్నర్ కోసం భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

విదేశీ ఆటగాళ్లలో వార్నర్ తర్వాత విండీస్ ఆల్​రౌండర్ జేసన్ హోల్డర్​కు భారీ డిమాండ్ ఉంది. అతని కోసం రూ.12కోట్లు వెచ్చించేందుకు ఆర్​సీబీ రెడీగా ఉన్నట్లు సమాచారం. భారీ సిక్సర్లు బాదడమే గాక, మీడియం పేస్​తో తెలివిగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడం హోల్డర్ ప్రత్యేకత.

jason holder
జేసన్ హోల్డర్​

అంతేగాక ఇతర విండీస్ ప్లేయర్లు, డ్వేన్ బ్రావో, యువ ఆటడాగు ఒడియన్ స్మిత్, రొమరియో షెఫర్డ్​లు కూడా మంచి ధరే పలికే అవకాశాలున్నాయి.

వార్నర్​, హోల్డర్ తర్వాత ఈసారి వేలంలో అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది దక్షిణాప్రికా ప్లేయర్ క్వింటన్ డీకాక్ మాత్రమే. దిల్లీ క్యాపిటల్స్ ఈ ఆటగాడిని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. నోర్ట్​జే గాయం కారణంగా దూరమైనందు వల్ల అతనికి చెల్లించే మొత్తంతో డీకాక్​ను సొంత చేసుకోవాలని భావిస్తోంది జట్టు యాజమాన్యం. అయితే రబాడను కూడా ఎలాగైన తిరిగి దక్కించుకోవాలని చూస్తున్న దిల్లీ క్యాపిటల్స్ పర్సులో రూ.47.5కోట్లు మాత్రమే మిగిలి ఉండటం ప్రతికూలాంశం.

షారుఖ్, నితీశ్, పడిక్కల్​..

అంతర్జాతీయ అరంగ్రేటం చేయకపోయినప్పటికీ యువ ఆటగాడు షారుక్ ఖాన్​కు రూ.5 నుంచి 8 కోట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇతడు గతేడాది పంజాబ్​ తరఫున ఆడి ఆకట్టుకున్నాడు. అలాగే ఐపీఎల్​లో విశేషంగా రాణిస్తున్న నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠిలు విదేశీ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్​, జానీ బెయిర్​స్టో, ఇయాన్ మోర్గాన్​ కంటే ఎక్కువ ధరే పలుకుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరూ రూ.10కోట్ల వరకు దక్కించుకోవచ్చని, మరో యువ ఆటగాడు దేవ్​దత్ పడిక్కల్​కు కూడా భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అండర్​-19 ప్లేయర్లలో రాజ్​ అంగడ్​ బవ(ఆల్​రౌండర్​), యష్ ధుల్​ వైపు కూడా ప్రాంఛైజీలు చూడొచ్చు. అయితే కమలేశ్ నాగర్​కోటి, శివం మావి, మన్​జోత్ కల్రాలా వీరికి అనుభవం లేకపోవడం వీరికి ప్రతికూలాంశం.

డొమెస్టిక్ ప్లేయర్లలో యశ్​ ఠాకూర్​, అభినవ్ మనోహర్​, మయాంక్ యాదవ్, రిత్విక్​ రాయ్​ చౌధరి, అభిశేక్ శర్మ, ముజతాబ యూసుఫ్​లు కూడా వేలంపాటలో మోస్తరు ధర పలకవచ్చు.

ఐపీఎల్​-2022 వేలం పాట ఫిబ్రవరి 12,13న బెంగళూరులో జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది, స్టార్​ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హట్​స్టార్​లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఈటీవీ భారత్​ కూడా లైవ్​ అప్డేట్స్​ అందిస్తుంది.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.