ETV Bharat / sports

ENG vs PAK: ఇలాంటి ఆటతో భావి తరాలకు ఏం చెప్తారు?

author img

By

Published : Jul 11, 2021, 8:21 PM IST

ఇంగ్లాండ్ టూర్​లో పాకిస్థాన్​ పేలవ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ కుర్రాళ్ల చేతిలో పాక్ ఘోర పరాజయంపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్​ అక్తర్(Shoaib Akhtar) మండిపడ్డాడు. పాకిస్థాన్ ఆటతీరు సాధారణంగా ఉందన్నాడు. ఇలాంటి ప్రదర్శనతో భవిష్యత్తు తరాల ఆటగాళ్లలో స్ఫూర్తి నింపగలరా? అని ప్రశ్నించాడు.

Shoaib Akhtar
షోయబ్​ అక్తర్

ఇంగ్లాండ్ కుర్రాళ్ల జట్టు.. పటిష్టమైన పాక్​ను మట్టికరిపించటంపై అభిమానులు, మాజీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాకిస్థాన్​ జట్టు వరుస వైఫల్యాలపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) మండిపడ్డాడు. పాక్​ ఆటతీరు చాలా సాధారణంగా ఉందన్నాడు. ఈ మేరకు టీం నిర్వహక బృందం, బోర్డు సభ్యులు, ఆటగాళ్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే.. పాకిస్థాన్​ 3-0 తో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఖాయమన్నాడు. ఇలాంటి ప్రదర్శనతో భవిష్యత్తు తరాల ఆటగాళ్లలో స్ఫూర్తి నింపగలరా? అని ప్రశ్నించాడు.

వైఫల్యం విలువ..

ఈ పరాజయం విలువ రిక్టర్​ స్కేల్​పై 15గా ఉందని ఆ దేశానికే చెందిన మరో మాజీ క్రికెటర్ రమీజ్ రాజా(Ramiz Raja) తీవ్ర విమర్శలు చేశాడు. పాకిస్థాన్​.. వరుస వైఫల్యాల కారణంగా అభిమానులు ఆటపై ఆసక్తి కనబరచటం లేదన్నాడు.

పాకిస్థాన్​ సిరీస్​కు ముందే.. ఇంగ్లాండ్ జట్టులో కరోనా కలవరం రేపింది. దీంతో కొత్త జట్టును ఈసీబీ ప్రకటించింది. 9 మంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ సిరీస్​కు స్టోక్స్​ను కెప్టెన్​గా నియమించింది. అయితే ఇంగ్లాండ్​ కుర్రాళ్ల చేతిలో పటిష్టమైన పాక్ జట్టు ఓటమితో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇంగ్లాండ్- పాకిస్థాన్ మూడు వన్డేల సిరీస్​ను 2-0తో ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి : ఇంగ్లాండ్​ కుర్రాళ్ల చేతిలో పాక్ ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.