ETV Bharat / sports

ఒక్క మ్యాచ్​.. రెండు ఘనతలు- ధావన్​ అందుకునేనా?

author img

By

Published : Jul 18, 2021, 2:41 PM IST

మరో 35 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ కెరీర్​లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు టీమ్ఇండియా కెప్టెన్​ శిఖర్​ ధావన్​(Shikhar Dhawan). దీంతో పాటు వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయికి కూడా చేరువలో ఉన్నాడు. శ్రీలంకతో ఆదివారం జరగనున్న తొలి వన్డలో ధావన్​ ఈ ఘనత సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Shikhar Dhawan can join elite list including Kohli, Dravid and Tendulkar with huge milestone
ఒకే మ్యాచ్​లో రెండు ఘనతలు సాధించే ఛాన్స్​!

మరికొద్దిసేపట్లో భారత్​, శ్రీలంక(IND Vs SL) మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ నేతృత్వంలో శిఖర్​ ధావన్​(Shikhar Dhawan) సారథ్యంలో టీమ్ఇండియా బరిలో దిగనుంది. ఈ మ్యాచ్​లో కెప్టెన్​ శిఖర్​ ధావన్​ ఓ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ కెరీర్​లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు ధావన్​ మరో 35 పరుగులు చేయాల్సి ఉంది. అయితే లంకతో జరగనున్న తొలి మ్యాచ్​లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఆ ఘనతను సాధించిన 14వ భారత బ్యాట్స్​మన్​గా(261 ఇన్నింగ్స్​లో) ధావన్​ రికార్డుకెక్కుతాడు.

శిఖర్​ ధావన్​ కెరీర్​లో ఇప్పటివరకు 142 వన్డేల్లో 45.28 సగటుతో 5,977 పరుగులు చేయగా.. అందులో 17 సెంచరీలు 32 అర్ధశతకాలున్నాయి. దీంతో పాటు భారత్​ తరఫున 34 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 2,315 రన్స్​ సాధించగా.. 65 టీ20లు ఆడి 1,673 పరుగులు నమోదు చేశాడు.

వన్డేల్లో 5,977 పరుగులు చేసిన ధావన్​.. మరో 23 పరుగుల చేస్తే, వన్డేల్లో 6 వేల రన్స్​ మైలురాయిని చేరుకుంటాడు. ఒకవేళ ఈ ఘనత సాధిస్తే.. 6వేల పరుగులు చేసిన 10వ భారత బ్యాట్స్​మన్​గా నిలుస్తాడు. అంతేకాకుండా విరాట్​ కోహ్లీ(136 ఇన్నింగ్స్​) తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న భారత క్రికెటర్​గా ధావన్​(140 ఇన్నింగ్స్​) ఘనత సాధిస్తాడు. 147 ఇన్నింగ్స్​లు ఆడి 6 వేల పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ నిలిచాడు.

ఇదీ చూడండి.. కోహ్లీ, బాబర్​ లేకుండానే అక్తర్​ 'ఆల్​టైం వన్డే XI'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.