ETV Bharat / sports

తనయుడి కోసం ధావన్​ ఎమోషనల్ - 'దేవుడి దయ వల్ల మనం మళ్లీ కలుస్తాం' - శిఖర్​ ధావన్ తనయుడు జోరావర్ బర్త్​డే

Shikar Dhawan Latest Instagram Post : స్టార్ క్రికెటర్ శిఖర్​ ధావన్ తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో తన తనయుడికి బర్త్​డే విషెస్​ చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనను చూసి ఏడాదయ్యిందంటూ చెప్పుకొచ్చాడు.

Shikar Dhawan Latest Instagram Post
Shikar Dhawan Latest Instagram Post
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 4:08 PM IST

Shikar Dhawan Latest Instagram Post : ఇటీవలే టీమ్ఇండియా స్టార్​ క్రికెటర్ శిఖర్ ధావన్​ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తన కుమారుడు జొరావర్‌ ప్రస్తుతం ఆమె కస్టడీలో ఉన్నాడు. దీంతో ఆ చిన్నారిని శిఖర్​ కలుసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా కుమారుడి బర్త్​డే సందర్భంగా సోషల్ మీడియా అకౌంట్​లో తన కుమారుడిని ఉద్దేశించి ధావన్​ ఓ ఎమోషనల్​ పోస్ట్ షేర్ చేశారు. 'నిన్ను చూసి ఏడాదవుతోంది' అంటూ ఎమోషనలయ్యాడు.

గతంలో జొరావర్​తో వీడియో కాల్ మాట్లాడిన సమయంలో తీసిన స్క్రీన్​షాన్​కు ఆయన షేర్​ చేసి ఓ క్యాప్షన్​ను రాశారు. "నిన్ను నేరుగా చూసి ఏడాది అవుతోంది. నాకు నిన్ను పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా అన్ని విధాలుగా నన్ను బ్లాక్‌ చేస్తున్నారు. కానీ, నీతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ టెలీపతితో ఎప్పటికీ నీ మనసుకు దగ్గరగా నేను ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని నాకు బాగా తెలుసు. ఈ పాపా (నాన్న) ఎప్పుడూ నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాడు. నీ నవ్వు కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. దేవుడి దయ వల్ల మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను. ధైర్యంగా ఉండు. దయ, వినయం, సహనంతో మెలుగు" అంటూ ధావన్​ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్​ చదివిన అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు. ధావన్​కు సపోర్ట్ చేస్తున్నారు.

Shikar Dhawan Divorce News : తామిద్దరూ విడిపోతున్నట్లు రెండేళ్ల క్రితమే శిఖర్‌ ధావన్‌, ఆయేషా ముఖర్జీ ప్రకటించారు. తన భార్య అతడ్ని మానసికంగా వేధిస్తోందంటూ ధావన్‌ దిల్లీలోని ఓ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని విచారంచిన కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

అయితే, తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్‌ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. అయినప్పటికీ ధావన్ తన కుమారుడితో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అనుమతించింది. అంతే కాకుండా స్కూల్‌ వెకేషన్‌ సమయంలో ఆయేషా జోరావర్​ను ఇండియాకు తీసుకొచ్చి ధావన్‌ కుటుంబంతో టైమ్ స్పెండ్​ చేసేలా చూడాలంటూ కోర్టు ఆదేశించింది. అయితే కానీ, గత మూడు నెలలుగా కుమారుడి నుంచి తనను పూర్తిగా బ్లాక్‌ చేశారంటూ ధావన్‌ తాజా పోస్ట్‌లో ఆరోపించాడు.

  • Getting Zoraver out of bed every morning is the toughest task 😂 But then there are moments like this one ❤️ pic.twitter.com/JY3s3XpAUY

    — Shikhar Dhawan (@SDhawan25) July 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Shikhar Dhawan Odi Career : ఇవి ధావన్​ రికార్డ్స్ రేంజ్​​.. అయినా జట్టులోకి నో ఎంట్రీ!

Shikhar Dhawan Divorce : శిఖర్‌ ధావన్‌కు విడాకులు మంజూరు.. విచారణలో తేలిన నిజాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.