ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది భారత మహిళా జట్టు. కెప్టెన్ మిథాలీ రాజ్ 59 పరుగులతో అదరగొట్టగా, యువ విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ(Shafali Verma) 44 పరుగులతో ఆకట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో షెఫాలీ.. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్(ms dhoni) ధోనీని తలపించింది.
ఏం జరిగింది?
ఈ మ్యాచ్‌లో షెఫాలీ తన సహజసిద్ధమైన ఆటతీరుతో మెప్పించింది. స్మృతి మంధాన (22)తో కలిసి మొదటి వికెట్‌కు 54 పరుగులు జోడించింది. ఈ క్రమంలోనే సోఫియా ఎక్లిస్టోన్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చింది. కానీ బంతి టర్న్ కావడం వల్ల అది కాస్తా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే వికెట్లను గిరాటేసింది జోన్స్. ఈ క్రమంలో షెఫాలీ తన కాళ్లను పూర్తిగా స్ట్రెస్ చేసింది. ఆస్ట్రేలియాపై ధోనీ కూడా ఓ మ్యాచ్‌లో ఇలాగే చేశాడు. కానీ ధోనీ ఔట్ నుంచి తప్పించుకోగా.. షెఫాలీ మాత్రం దొరికిపోయింది.
-
Shafali Verma tried doing a Dhoni here today. Unfortunately a touch and go decision went against her. #ShafaliVerma pic.twitter.com/OyeDpnZyjE
— Sudhanshu gupta (@Sudhans97048678) June 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shafali Verma tried doing a Dhoni here today. Unfortunately a touch and go decision went against her. #ShafaliVerma pic.twitter.com/OyeDpnZyjE
— Sudhanshu gupta (@Sudhans97048678) June 30, 2021Shafali Verma tried doing a Dhoni here today. Unfortunately a touch and go decision went against her. #ShafaliVerma pic.twitter.com/OyeDpnZyjE
— Sudhanshu gupta (@Sudhans97048678) June 30, 2021
ఔట్‌తో వివాదం
షెఫాలీ స్టంపౌట్ వివాదానికి దారి తీసింది. కీపర్ బంతిని తీసుకుని వికెట్లను గిరాటేసిన సమయంలో షెఫాలీ కాలు క్రీజు లైన్‌పై ఉంది. కానీ అంపైర్ కాల్ ద్వారా దీనిని ఔట్‌గా పరిగణించారు థర్డ్ అంపైర్. ఇలాంటి సంఘటనల్ని పునరావృతం చేయకూడదని, రనౌట్‌ను కచ్చితంగా తెలుసుకునేందుకు పురుషుల క్రికెట్లో బెయిల్స్‌ను ఎల్ఈడీ రంగులతో తయారు చేస్తున్నారు. దీని ద్వారా బంతి బెయిల్ తాకిన వెంటనే లైట్లు వెలుగుతాయి. దీంతో బ్యాట్స్‌మెన్ రనౌట్‌ను సమయోచితంగా నిర్ణయించవచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో ఎల్ఈడీ బెయిల్స్ వాడకపోవడం ద్వారా బెయిల్స్, బంతిని ఎప్పుడు తాకిందో కచ్చితంగా తెలియరాలేదు. ఒకవేళ ఎల్ఈడీ బెయిల్స్ వాడి ఉంటే షెఫాలీ నాటౌట్‌గా నిలిచేదని అంటున్నారు అభిమానులు, మాజీలు. ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ లీసా స్థలేకర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
-
This is the second time in 2 ODI’s that we are making harder than it needs to be for the third umpire. Be great to get bright coloured bails pic.twitter.com/0bXAdO1jMw
— Lisa Sthalekar (@sthalekar93) June 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is the second time in 2 ODI’s that we are making harder than it needs to be for the third umpire. Be great to get bright coloured bails pic.twitter.com/0bXAdO1jMw
— Lisa Sthalekar (@sthalekar93) June 30, 2021This is the second time in 2 ODI’s that we are making harder than it needs to be for the third umpire. Be great to get bright coloured bails pic.twitter.com/0bXAdO1jMw
— Lisa Sthalekar (@sthalekar93) June 30, 2021