ETV Bharat / sports

'ఒలింపిక్స్​లో 10 మంది.. పాక్​కు ఇది సిగ్గుచేటు' - ఇమ్రాన్ నాజిర్

టోక్యో ఒలింపిక్స్​కు పాకిస్థాన్ నుంచి కేవలం 10 మంది ప్రాతినిధ్యం వహిస్తుండటంపై ఆ దేశ మాజీ క్రికెటర్​ ఇమ్రాన్ నాజిర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇది నిజంగా సిగ్గుచేటని నాజిర్​ అభిప్రాయపడ్డాడు.

imran nazir
ఇమ్రాన్ నాజిర్
author img

By

Published : Jul 25, 2021, 8:24 PM IST

"22 కోట్ల జనాభా గల దేశం నుంచి ఒలింపిక్స్‌కు కేవలం 10 మంది ఆటగాళ్లే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది నిజంగా విచారకరం. క్రీడల్లో పాకిస్థాన్‌ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతి ఒక్కరికీ ఇది సిగ్గుచేటు" అని పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ నాజిర్‌ అన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ నుంచి 10 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుండడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. 2012 ఒలింపిక్స్‌కి.. ఇప్పటికీ పరిస్థితులు ఎలా మారాయో అద్దం పట్టే ఓ చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

తమ దేశంలో ప్రతిభకు కొదవలేదని నాజిర్‌ అభిప్రాయపడ్డాడు. కానీ, క్రీడల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే బాధ్యత గల నాయకులు లేరని వ్యాఖ్యానించాడు. అలాగే చాలా మంది పాకిస్థాన్‌లో క్రీడలకు సంబంధించిన సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారన్నాడు. కానీ, ఎంతమంది ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించాడు. ఆర్థిక సహకారం అవసరం ఉన్న ఒక ఆటగాడి వివరాలిస్తే ఎంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారని నిలదీశాడు.

  • This is actually sad. Just 10 athletes from a country of 220 million people.

    To everyone who is responsible for Pakistan's such decline in sports , SHAME ON YOU! pic.twitter.com/4qkqC1cj7N

    — Imran Nazir (@realimrannazir4) July 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో పాక్‌ తరఫున 21 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. అత్యధికంగా 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌కు పాక్‌ తరఫున 62 మంది అర్హత సాధించారు. ఇక పాక్‌ పేరిట ఇప్పటి రకు 10 పతకాలున్నాయి. వీటిలో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత పాక్‌ ఒక్క పతకం కూడా సాధించలేదు. అప్పట్లో బలంగా ఉన్న పాక్ పురుషుల హాకీ టీం సాధించిన కాంస్యమే పాక్ ముద్దాడిన చివరి ఒలింపిక్‌ పతకం.

1999-2012 మధ్య పాకిస్థాన్‌ క్రికెట్‌ టీంలో ఆడిన ఇమ్రాన్‌ నాజిర్‌.. మంచి హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 14 బంతుల్లో అర్ధశతకం సాధించిన రికార్డు అతని పేరిట ఉంది.

ఇదీ చదవండి: 'ఇక జట్టులో మనీశ్​ పాండేకు చోటు కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.