ETV Bharat / sports

'బిగ్​బాష్​'లో భారత్​ నుంచి మరో ఇద్దరు - షెఫాలీ వర్మ బిగ్​బాష్ లీగ్​

ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్​బాష్​​లో మరో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు ఆడనున్నారు. యువ క్రికెటర్ షెఫాలీ వర్మ ఆడటం ఇప్పటికే. ఖరారవగా, రాధా యాదవ్​ గురించి చర్చలు జరుగుతున్నాయి.

bigbash league
బిగ్​బాష్​ లీగ్
author img

By

Published : May 13, 2021, 4:35 PM IST

భారత మహిళా క్రికెట్​ యువ సంచలనం షెఫాలీ వర్మ.. ఉమెన్​ బిగ్​బాష్​ లీగ్​లో అరంగేట్రం చేయనుంది. ఈ సీజన్​ నుంచి సిడ్నీ సిక్సర్స్​ తరఫున ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. "షెఫాలీ ఒప్పందం పూర్తయింది. ఉమెన్ బిగ్ బాష్​ లీగ్​ షెడ్యూల్​ విడుదల చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. లెఫ్ట్​ ఆర్మ్​స్పిన్నర్ రాధా యాదవ్​ కూడా ఈ లీగ్​లో అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి" అని ఆయన చెప్పారు.

టీమ్​ఇండియా టీ20 జట్టు కెప్టెన్ హర్మన్​ప్రీత్​ కౌర్​(సిడ్నీ థండర్​), ఓపెనర్​ స్మృతి మంధాన(బ్రిస్బేన్​ హీట్​), ఆల్​రౌండర్​ వేదా కృష్ణమూర్తి(హోబార్ట్​ హర్రికేన్స్​) తరఫున ఇప్పటికే బిగ్​బాష్ లీగ్​లో ఆడుతున్నారు.

షెఫాలీ.. యూకేలో జరగబోయే 'ది హండ్రెడ్​' ప్రారంభ సీజన్​​లోనూ ఆడేందుకు సిద్ధమైంది. ఈమె బీసీసీఐ నుంచి నిరంభ్యతర పత్రం(ఎన్​ఓసీ) పొందినట్లు క్రికెట్ వర్గాలు ధ్రువీకరించాయి. కివీస్ ఆల్​రౌండర్​ సోఫీ డివైన్​ నేతృత్వంలోని బర్మింగ్​హామ్​ ఫోనిక్స్​ జట్టు తరఫున ఈమె బరిలోకి దిగనుంది. ఈ లీగ్​లో ఇప్పటికే టీ20 కెప్టెన్​ హర్మన్​ప్రీత్ కౌర్​తో పాటు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్​, దీప్తి శర్మ.. బోర్డు నుంచి నిరభ్యంతర పత్రాన్ని పొందారు.

ఇదీ చూడండి: 'ది హండ్రెడ్' లీగ్​లో మరో భారత క్రికెటర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.