టీమ్ఇండియా యువ సంచలనం షెఫాలీ వర్మ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అతి పిన్న వయసులో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా సరికొత్త ఫీట్ సాధించింది.
ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లోనే భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ యువ బ్యాటర్.. ప్రస్తుత ఇంగ్లాండ్ టూర్లోనే సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ నుంచి వన్డే క్యాప్ అందుకుంది షెఫాలీ.
15 ఏళ్ల 239 రోజుల వయసులో టీ20ల్లో అడుగుపెట్టింది షెఫాలీ. 2019 సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న షెఫాలీ.. ఇటీవల బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో సుదీర్ఘ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. ప్రస్తుతం 17 ఏళ్ల 150 వయసున్న షెఫాలీ.. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి వన్డేతో ఈ ఫీట్ సాధించింది.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. అరంగేట్రం మ్యాచ్‌లో 14 బంతుల్లో 15 పరుగులు చేసి వెనుదిరిగింది షెఫాలీ.
ఇదీ చదవండి: WTC Final: 'ఈసారి టీమ్ఇండియాదే టైటిల్'