ETV Bharat / sports

'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' రేసులో షెఫాలీ, స్నేహ్​ రాణా - కాన్వే

జూన్ నెలకు ఐసీసీ ప్లేయర్​ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచారు భారత మహిళా క్రికెటర్లు షెఫాలీ వర్మ, స్నేహ్​ రాణా. వీరితో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్ ఎకిల్​స్టోన్​ కూడా నామినేట్ అయింది. పురుషుల విభాగంలో కివీస్​ ప్లేయర్లు కాన్వే, జేమీసన్​, దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ రేసులో ఉన్నారు.​

sneh rana, shafali verma
స్నేహ్ రాణా, షెఫాలీ వర్మ
author img

By

Published : Jul 7, 2021, 2:29 PM IST

భారత యువ సంచలనం షెఫాలీ వర్మతో పాటు ఆల్​రౌండర్​ స్నేహ్​ రాణా.. 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​లో ఈ ఇద్దరూ రాణించారు. వీరితో పాటు ఇంగ్లాండ్ బౌలర్​ సోఫీ ఎకిల్​స్టోన్​నూ జూన్​ నెలకుగానూ నామినేట్​ చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి.

పొట్టి ఫార్మాట్​లో అద్భుత ప్రదర్శనలతో టెస్టుల్లో, వన్డేల్లో చోటు సంపాదించిన షెఫాలీ.. అరంగేట్ర సిరీస్​లోనే ఆకట్టుకుంది. బ్రిస్టల్​ వేదికగా ఇంగ్లాండ్​పై జరిగిన ఏకైక టెస్టులో ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​గా ఎంపికైంది. ఇరు ఇన్నింగ్స్​ల్లో హాఫ్​ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్​మన్​గా, మొత్తంగా నాలుగో మహిళా క్రికెటర్​గా నిలిచింది. ఇక వన్డేల్లోనూ ఫర్వాలేదనిపించింది షెఫాలీ.

బ్రిస్టల్​ టెస్టు డ్రా కావడంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది ఆల్​రౌండర్ స్నేహ్​ రాణా. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లాండ్​కు విజయాన్ని దూరం చేసింది. ఇక బంతితోనూ మెరిసిన రాణా నాలుగు వికెట్లతో రాణించింది.

భారత్​తో టెస్టులో 8 వికెట్ల తేడాతో రాణించిన ఇంగ్లాండ్​ బౌలర్​ ఎకిల్​స్టోన్​ కూడా పోటీలో నిలిచింది.

ఇక పురుషుల విభాగంలో న్యూజిలాండ్ బ్యాట్స్​మన్​ డేవన్ కాన్వే, పేసర్​ కైల్ జేమీసన్​తో పాటు దక్షిణాఫ్రికా వికెట్​కీపర్​ క్వింటాన్​ డికాక్​ను నామినేట్ చేసింది ఐసీసీ.

లార్డ్స్ వేదికగా జూన్​లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో అరంగేట్రంలోనే డబుల్​ సెంచరీ బాదేశాడు కివీస్ క్రికెటర్ కాన్వే. తర్వాత జరిగిన రెండో టెస్టులోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక భారత్​తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఆల్​రౌండర్​ జేమీసన్​ డబ్ల్యూటీసీ మ్యాచ్​లో 7 వికెట్లతో మెరిశాడు.

విండీస్​తో టెస్టు సిరీస్​లో దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ 141, 96 పరుగులు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.