Legends League Cricket: ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు పాల్గొనబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 20 నుంచి ఈ టోర్నీ ఒమన్ వేదికగా జరగనుంది. ఇందులో మూడు జట్లు పోటీపడనున్నాయి. భారత ఆటగాళ్లు ఇండియా మహారాజ టీమ్‌లో ఆడనున్నారు. ఆసియా లయన్స్, రెస్టాఫ్ ద వరల్డ్ మిగతా జట్లు. కాగా ఈ టోర్నీలో భారత్ నుంచి పాల్గొనబోయే వారి జాబితా వచ్చేసింది. టీమ్ఇండియా మాజీ స్టార్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. ఈ విషయాన్ని టీమ్ఇండియా మాజీ కోచ్, లెజెండ్స్ క్రికెట్ లీగ్ కమిషనర్ రవిశాస్త్రి వెల్లడించారు.
భారత జట్టుతో పాటు ఆసియా లయన్స్ జట్టును ప్రకటించారు. రెస్టాఫ్ ద వరల్డ్‌కు సంబంధించిన జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు. జట్లు, ఆటగాళ్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియా మహారాజ
వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, బద్రినాథ్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ, హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ భండారి.
ఆసియా లయన్స్
షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదీ, సనత్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్, కమ్రన్ అక్మల్, చమింద వాస్, రోమేష్ కలువితరన, దిల్షాన్, అజార్ మహ్మూద్, ఉపుల్ తరంగ, మిస్బావుల్ హక్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మొహమ్మద్ యూసఫ్, ఉమల్ గుల్, అస్గర్ అఫ్గాన్.