ETV Bharat / sports

Sanju Samson Australia Series : సంజూ శాంసన్​.. ఇక కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్లేనా ?

Sanju Samson Australia Series : ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కుగాను బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమ్​ఇండియా ప్లేయర్​ సంజు శాంసన్​ ప్రస్థావనే రాలేదు. దీంతో సంజూ ఫ్యాన్స్​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంజూ కమ్​బ్యాక్​కు అన్ని దారులు మూసుకుపోయాయంటూ ఆందోళన చెందుతున్నారు.

Sanju Samson Australia Series
Sanju Samson Australia Series
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 2:04 PM IST

Sanju Samson Australia Series : ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కుగానూ బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమ్​ఇండియా ప్లేయర్​ సంజు శాంసన్​ ప్రస్థావనే రాలేదు. దీంతో అతనికి మళ్లీ నిరాశే ఎదురైంది. గతంలో ఆసియా కప్​ టీమ్​లోనూ రిజర్వ్​ ప్లేయర్​గా వచ్చినప్పటికీ.. మైదానంలో ఆడే అవకాశం దక్కలేదు. కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ తర్వాత సంజుకు ఉన్న ఒక్క ఛాన్స్​ కూడా పోయింది.

తాజాగా జరిగిన ఆసియాకప్‌లో ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ అద్భుత ప్రదర్శన చేశారు. పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్​ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4లో కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ సాధించాడు. ఇలా వీరిద్దరి అద్భుత ప్రదర్శన పరిశీలిస్తే సంజూకు తిరిగి టీమ్‌ఇండియా జట్టులోకి రావడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగాఫ ఫ్యాన్స్​ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజూ కమ్​బ్యాక్​కు అన్ని దారులు మూసుకుపోయాయంటూ ఆందోళన చెందుతున్నారు.

Sanju Samson ODI Career : ఇక సంజూ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే.. భారత జట్టు తరఫున సంజూ 13 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 390 పరుగులు చేశాడు. అప్పుడు సంజూ శాంసన్ సగటు 55.71 కాగా, అతని స్ట్రైక్ రేట్ 104గా ఉంది. అయితే ఇప్పటి వరకు సంజూ తన వన్డే ఫార్మాట్‌ కెరీర్​లో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. కానీ హాఫ్​ సెంచరీ మార్క్‌ను మూడు సార్లు దాటాడు.

మరోవైపు సంజూ.. 24 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లు ఆడాడు. వాస్తవానికి సంజూ ఐపీఎల్ మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. కానీ అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రం పేలవ ప్రదర్శనతో కొనసాగాడు. దీంతో సెలక్టర్లు కూడా అతని పేరును పక్కనబెట్టారని విశ్లేషకులు అంటున్నారు.

గాయం కూడా..
Sanju Samson Injury : గతంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్​లో సంజూ తీవ్ర గాయలపాలయ్యాడు. తొలి వన్డేలో తొలి ఓవర్లోనే క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసిన శాంసన్.. బాల్​ పట్టుకునేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్నప్పటికీ.. దాన్ని ఒడిసిపట్టుకోలేకపోయాడు. ఆ సమయంలోనే అతడి మోకాలికి దెబ్బ తాకింది. అయినా ఆ తర్వాత ఫీల్డింగ్ చేశాడు. కానీ తర్వాత మోకాలు వాపు రావడం వల్ల చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

Ajit Agarkar Team Selection : 'అందుకే చాహల్​ను తప్పించాం.. ధావన్ మంచి ప్లేయరే కానీ'

Ind VS Ireland : రింకు, సంజు దూకుడు.. బంతితో ప్రసిద్ధ్ మెరుపులు.. రెండో టీ20 హైలైట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.