Sanjay Manjrekar on Rahane: ఒకప్పుడు టీమ్‌ఇండియాకు అన్ని ఫార్మాట్లలో కీలక బ్యాటర్‌గా ఉన్న అజింక్య రహానే.. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే వన్డే జట్టులో స్థానం కోల్పోయి టెస్టులకు మాత్రమే ఎంపిక అవుతున్నాడు. ఇప్పుడు అతడి టెస్టు కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. ఎందుకంటే దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అతడు రాణించలేదు. మూడు టెస్టుల్లో కలిపి 136 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రహానే ఆటతీరుపై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు. రహానే తిరిగి ఫామ్‌ని అందుకునేందుకు మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.
'ప్రస్తుత పరిస్థితుల్లో నేనైతే రహానేకు మరో అవకాశం ఇవ్వలేను. గత మూడు, నాలుగేళ్లుగా అతడి ప్రదర్శన పేలవంగా ఉంది. మెల్బోర్న్లో శతకం సాధించినా మిగతా వాటిల్లో ఆశించిన రీతిలో ఆడలేదు. రహానె మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిన అవసరముంది. అతడు ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నా' అని మంజ్రేకర్ అన్నాడు. ఇక, 2021లో టెస్టు కెరీర్‌ని పరిశీలిస్తే.. 15 మ్యాచ్‌ల్లో 20.25 సగటుతో 547 పరుగులు మాత్రమే చేశాడు. 11 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరడం గమనార్హం. మరోవైపు, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో.. భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని అతిథ్య జట్టు సునాయసంగా ఛేదించి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: