న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్(ind vs nz t20 series 2021)ను రోహిత్‌సేన క్లీన్‌స్వీప్ చేయడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. మధ్య ఓవర్లలో వారు చక్కగా బౌలింగ్ చేశారని చెప్పాడు. తొలుత కివీస్ ఓపెనర్లు భారత బౌలర్లపై కాస్త ఆధిపత్యం చెలాయించారని, అయితే.. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు బాగా కట్టడి చేశారని గుర్తుచేశాడు.
రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కివీస్ బ్యాట్స్‌మెన్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారని బంగర్(sanjay bangar news) చెప్పుకొచ్చాడు. దీంతో టీమ్‌ఇండియాకు బాగా కలిసివచ్చిందన్నాడు. అలాగే హర్షల్ పటేల్ కూడా ఈ సిరీస్‌లో రాణించాడని మెచ్చుకున్నాడు. అతడు అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడని, తన స్లో బౌలింగ్ వైవిధ్యంతో మరింత ఆకట్టుకున్నాడని తెలిపాడు. మంచు ప్రభావం ఉన్నా అద్భుతంగా బౌలింగ్ చేశాడని, స్లో పిచ్ బంతులు, బౌన్సర్లతో అనేక వేరియేషన్స్ చూపించాడని తెలిపాడు. ఇది టీమ్‌ఇండియాకు ఎంతో మంచిదని బంగర్ విశ్లేషించాడు.