ETV Bharat / sports

మైనర్​పై అత్యాచారం కేసులో తీర్పు - దోషిగా నేపాల్ క్రికెట్​ ప్లేయర్​ - సందీప్‌ లామిచ్చెన్‌ కేసు

Sandeep Lamichhane Rape Case : ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో నేపాల్ స్టార్​ క్రికెటర్​ సందీప్‌ లామిచ్చెన్‌ను కాఠ్ మాండూ జిల్లా కోర్డు దోషిగా తేల్చింది.

Sandeep Lamichhane Rape Case
Sandeep Lamichhane Rape Case
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 10:53 PM IST

Updated : Dec 30, 2023, 10:19 AM IST

Sandeep Lamichhane Rape Case : ఓ మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో నేపాల్​ క్రికెట్ టీమ్​ మాజీ కెప్టెన్‌ సందీప్‌ లామిచ్చెన్‌ను కాఠ్ మాండూ జిల్లా కోర్డు దోషిగా తేల్చింది. గతేడాది ఆగస్టులో కాఠ్ మాండూలోని ఓ హోటల్​లో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ బాలిక కోర్టును ఆశ్రయించింది. దీంతో కొన్నాళ్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్​ పూర్తి చేసుకొని నేపాల్​కు తిరిగి వచ్చిన సందీప్​ను పోలీసులు ఎయిర్​ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్​లో అతడ్ని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే హై కోర్టుకు వెళ్లి సందీప్ బెయిల్ తెచ్చుకున్నాడు. కాగా, తాజాగా కోర్టు అతడ్ని దోషిగా నిర్ధారించింది. శిశిర్ రాజ్ ధాకల్‌తో కూడిన ఓ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

తొలి నేపాల్ ప్లేయర్​: సందీప్ లామిచెనె ఐపీఎల్​లో ఆడిన తొలి నేపాల్ ప్లేయర్​గా గుర్తింపు పొందాడు. అతడు 2018లో దిల్లీ క్యాపిటల్స్ (అప్పటి దిల్లీ డేర్ డెవిల్స్) జట్టుతో ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు. కెరీర్​లో రెండు సీజన్​లో ఆడిన సందీప్ 9 మ్యాచ్​ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్​తో పాటు సందీప్ బిగ్​బాష్ లీగ్, పాకిస్థాన్ టీ20 లీగ్​ల్లో ఆడుతున్నాడు.

అంతర్జాతీయ రికార్డులు: అఫ్గానిస్థాన్ పలు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు సందీప్ లామిచెనె. వన్డేల్లో అత్యధిక వేగంగా 50 వికెట్లు తీసిన రెండో బౌలర్​గా సందీప్ రికార్డులకెక్కాడు. అటు పొట్టి ఫార్మాట్​లోనూ సందీప్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. టీ20ల్లో కూడా వేగంగా 50 వికెట్ల మార్క్ అందుకున్న మూడో బౌలర్​గా నిలిచాడు. ఇక అంతర్డాతీయంగా 51 వన్డేల్లో 112, 52 టీ20 మ్యాచ్​ల్లో 98 వికెట్లు పడగొట్టాడు. ఇక వన్డేల్లో 2023 ఆసియా కప్​లో భారత్​తో చివరి మ్యాచ్ ఆడాడు. టీ20ల్లో చివరిసారిగా గతనెలలో జరిగిన అఫ్గానిస్థాన్- ఒమన్ మ్యాచ్​లో ఆడాడు. ​ఈ మ్యాచ్​లో ఆఫ్గానిస్థాన్​కు ప్రాతినిధ్యం వహించిన సందీప్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

అదరగొట్టిన అఫ్గాన్ బ్యాటర్లు - ఆసీస్ ముందు భారీ లక్ష్యం!

మెగాటోర్నీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్​గా అఫ్గాన్​​-సెమీస్ చేరేందుకు ఇంకా ఛాన్స్​!

Last Updated : Dec 30, 2023, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.