ETV Bharat / sports

క్రికెటర్ సందీప్​కు 8 ఏళ్ల జైలు శిక్ష- మైనర్​పై అత్యాచారం కేసులో నేపాల్ కోర్టు తీర్పు - సందీప్ రేప్​ కేసు

Sandeep Lamichhane Rape Case: నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్​కు ఆ దేశ కోర్టు 8 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఓ మైనర్​పై అత్యాచారం కేసులో విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Sandeep Lamichhane Rape Case
Sandeep Lamichhane Rape Case
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 4:58 PM IST

Updated : Jan 10, 2024, 6:34 PM IST

Sandeep Lamichhane Rape Case: మైనర్​పై అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్​కు ఆ దేశ కోర్టు 8 ఏళ్లు జైలు శిక్ష విధించింది. బుధవారం విచారణ చేపట్టిన శిషిర్ రాజ్​ ధఖల్​ ధర్మాసం, సందీప్​కు ఎనిమిదేళ్ల జైలు శిక్షతోపాటు, జరిమానా కూడా విధించిందని నేపాల్ కోర్టు అధికారి రాము శర్మ తెలిపారు. 2022 ఆగస్టులో కాఠ్ మాండూలోని ఓ హోటల్​లో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ బాలిక కోర్టును ఆశ్రయించగా, తాజాగా తీర్పు వచ్చింది.

  • Nepal court sentences eight years imprisonment to star cricketer Sandeep Lamichhane in a rape case

    The bench of Shishir Raj Dhakal handed over the verdict of 8 years imprisonment along with compensation and penalties after a hearing today, confirms court official Ramu Sharma.

    — ANI (@ANI) January 10, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ కేసు: 2022 ఆగస్టు 21న కాఠ్ మాండూ, భక్తపూర్​లో తనను పలు ప్రాంతాల్లో తిప్పి అదే రోజు రాత్రి కాఠ్​ మాండు సినమంగల్​లోని ఓ హోటల్​కు తీసుకొచ్చి అక్కడే అత్యాచారం చేసినట్లు నేపాల్​కు చెందిన ఓ 17 ఏళ్ల మైనర్ ఆరోపించింది. అతడిపై అక్కడి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నేపాల్​ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్​ జారీ చేసింది. దీంతో నేపాల్ క్రికెట్ బోర్డు సందీప్​పై వేటు వేసింది.

ఇక గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్​ పూర్తి చేసుకొని నేపాల్​కు తిరిగి వచ్చిన సందీప్​ను పోలీసులు ఎయిర్​ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్​లో అతడ్ని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే హై కోర్టుకు వెళ్లి సందీప్ బెయిల్ తెచ్చుకున్నాడు. కాగా, రీసెంట్​గా సందీప్​ను దోషీగా తేల్చిన నేపాల్ కోర్టు బుధవారం ఈ తీర్పును వెలువరించింది.

తొలి నేపాల్ ప్లేయర్​: సందీప్ లామిచెనె ఐపీఎల్​ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఆడిన తొలి నేపాల్ ప్లేయర్​గా గుర్తింపు పొందాడు. అతడు 2018లో దిల్లీ క్యాపిటల్స్ (అప్పటి దిల్లీ డేర్ డెవిల్స్) జట్టుతో ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు. కెరీర్​లో రెండు సీజన్​లో ఆడిన సందీప్ 9 మ్యాచ్​ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్​తో పాటు సందీప్ బిగ్​బాష్ లీగ్, పాకిస్థాన్ టీ20 లీగ్​ల్లో ఆడుతున్నాడు.

మైనర్​పై అత్యాచారం కేసులో తీర్పు - దోషిగా నేపాల్ క్రికెట్​ ప్లేయర్​

Kushal Malla Century : యువరాజ్ రికార్డు బద్దలు.. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. టీ20ల్లో నేపాల్ ట్రిపుల్ సెంచరీ!

Last Updated : Jan 10, 2024, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.