ETV Bharat / sports

'వాన్​ దిగజారుడు స్వభావానికి ఇది నిదర్శనం'

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్, పాక్ క్రికెటర్ సల్మాన్ బట్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బట్​ ఫిక్సింగ్ విషయంపై వాన్ చేసిన వ్యాఖ్యలు పలువురి విమర్శలకు కారణమయ్యాయి. తాజాగా దీనిపై స్పందించాడు బట్.

Vaughans, Salman Butt
వాన్​, సల్మాన్ బట్
author img

By

Published : May 18, 2021, 10:11 AM IST

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌, పాక్‌ క్రికెటర్‌ సల్మాన్ బట్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వాన్‌ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాడని బట్ అన్నాడు. కొందరికి మానసిక అజీర్తి అనే రుగ్మత ఉంటుందని విమర్శించాడు. మాటలు, చేతలను బట్టే అతడి మూర్తిమత్వం ఏంటో తెలుస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించాడు. గతం గురించి మాట్లాడటంలో అర్థం ఏముందని ప్రశ్నించాడు. 2010లో బట్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసి నిషేధానికి గురయ్యాడు.

"వివరాల్లోకి వెళ్లను. వాన్‌ ఎంచుకున్న కోణం తప్పు. అతడు నన్ను విమర్శించడంలో అర్థం లేదు. నా గతం గురించి మాట్లాడటం స్థాయికి తగింది కాదు. అది దిగజారుడు తనమే! ఇంకా దాని గురించే మాట్లాడాలనుకుంటే అతనిష్టం. అజీర్తి ఓ రుగ్మత. లోపల ఉన్నవి అంత సులభంగా బయటకు రావు. కొందరికి మానసిక అజీర్తి ఉంటుంది. వారి బుద్ధి ఇంకా గతంలోనే ఉండిపోయింది. నేను వాటిని పట్టించుకోను" అని బట్ స్పందించాడు.

"మేం ఇద్దరు గొప్ప ఆటగాళ్ల గురించి మాట్లాడాం. చర్చ దిశను మళ్లించాల్సిన అవసరం లేదు. కానీ వాన్‌ మరో వైపే వెళ్లాడు. గతం గతః అలాగని నిజాలు మారవు కదా. అతడు తర్కబద్ధమైన ఉదాహరణలు, అనుభవ పూర్వక పరిశీలనలు, సంబంధిత గణాంకాలు ఇస్తే బాగుండేది. దాన్నుంచి మేమూ నేర్చుకొనేవాళ్లం" అని బట్ అన్నాడు.

"వాన్‌ క్రికెట్‌ గురించి మాట్లాడి మమ్మల్ని తప్పని నిరూపిస్తే అతడు సరైన వాడే అని అనుకునేవారు. అప్పుడు సరదాగా ఉండేది. కళంకిత వ్యవహారంపై స్పందించాడు. దీంతో అతనేంటో తెలుస్తోంది. అతడింకా దానినే కొనసాగించొచ్చు. కానీ దాంతో ఏం లాభం? ఏదేమైనా అతడు తానేంటో నిర్వచించుకున్నాడు" అని బట్ తన యూట్యూబ్ ఛానళ్లో చెప్పాడు.

ఇవీ చూడండి:

'కేన్​ భారతీయుడైతే.. కోహ్లీని పట్టించుకునేవారే కాదు'

'ఫిక్సింగ్ చేసేపుడు ఈ స్పష్టత ఉంటే బాగుండు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.