Saha BCCI: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ప్రధాన కోచ్ ద్రవిడ్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను బీసీసీఐ వివరణ కోరనున్నట్లు సమాచారం. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాని సాహా.. వీరిద్దరిని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశాడు.
సాహా ఏమన్నాడు?
తనను రిటైర్‌మెంట్ గురించి ఆలోచించాలని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడని ఇటీవలే సాహా పేర్కొన్నాడు. దాంతో పాటే గంగూలీ వ్యక్తిగతంగా పంపిన సందేశాన్నీ వెల్లడించాడు. అయితే ఆటగాళ్లు.. జట్టు ఎంపిక, ఆట గురించి, ఆటలో జరిగే సంభాషణలను బహిరంగపరచడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధం. జాతీయ స్థాయి ఆటగాడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదు.
ఈ నేపథ్యంలోనే అతడి నుంచి బీసీసీఐ వివరణ కోరనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయితే సాహాకు షోకాజ్ నోటీస్‌లు పంపడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. భవిష్యత్‌లో ఇచ్చే అవకాశం మాత్రం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా అందుకే తప్పుకొన్నా : విరాట్ కోహ్లీ