Sachin Tendulkar: టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందుల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా కాలమైనా.. ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. తాజాగా అతడు ఓ బీచ్‌లో గాయపడిన పక్షికి సపర్యలు చేసి మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఆ వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు దానికి కోటి 30 లక్షల మందికి పైగా లైకులు కొట్టారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆ వీడియోలో సచిన్ ఆ పక్షికి నీళ్లు తాగించే ప్రయత్నం చేయడం సహా ఏదో ఆహారం కూడా పెట్టి కాస్త కోలుకునేలా చేశాడు. 'మనం అందించే కాస్తంత ప్రేమ, ఆప్యాయత ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా మార్చుతుంది' అని క్యాప్షన్ పెట్టాడు.
ఇదీ చూడండి : IND VS SL T20: టీ20ల్లో రోహిత్‌శర్మ సరికొత్త రికార్డు