ETV Bharat / sports

'లాఫ్టెడ్​ షాట్​'తో అదరగొట్టిన సచిన్​.. వీడియో చూశారా? - రోడ్​ సేఫ్టీ వరల్డ్ సిరీస్​

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ మరోసారి తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో మైదానంలో అభిమానులను అలరించాడు. అదేంటి.. సచిన్‌ క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకొని చాలా కాలం అవుతోందిగా.. అతడు బ్యాట్‌ పట్టడమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవేయండి..

Sachin Lofted Shot At Road Safety World Series

author img

By

Published : Sep 11, 2022, 12:59 PM IST

Sachin Lofted Shot At Road Safety World Series: రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా మాస్టర్​ సచిన్‌ తెందూల్కర్​..ఇండియా లెజెండ్స్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా కాన్పూర్‌ వేదికగా శనివారం దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో ఈ జట్టు తలపడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్‌ కొద్దిసేపే క్రీజులో నిలిచినప్పటికీ.. తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు.

మఖాయా ఎంటినీ బౌలింగ్‌లో లాఫ్టెడ్‌ షాట్‌తో మరోసారి పాత మాస్టర్‌ బ్లాస్టర్‌ను గుర్తుచేశాడు. చూడచక్కటి ఈ షాట్‌తో.. అభిమానుల కేరింతలతో స్టేడియం మార్మోగింది. అతడు క్రీజులో ఉన్నంతసేపు సచిన్‌.. సచిన్‌.. అంటూ అభిమానులు సందడి చేశారు.

అయితే 16 పరుగులు చేసి సచిన్‌ పెవిలియన్‌ చేరగా.. స్టువర్ట్‌ బిన్నీ అద్భుతమైన ఇన్నింగ్స్‌(24 బంతుల్లో 82 పరుగులు) ఆడాడు. దీంతో ఆ జట్టు ప్రత్యర్థి ముందు 217 (4 వికెట్ల నష్టానికి) పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ తడబడటం వల్ల సచిన్‌ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవీ చదవండి: యూఎస్​ ఓపెన్​ విజేతగా ఇగా స్వైటెక్‌.. తొలి క్రీడాకారిణిగా రికార్డు

యూఎస్ ఓపెన్‌ ఫైనల్లో అల్కరాజ్‌, రూడ్‌.. గెలిచిన వారిదే అగ్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.