sachin jay shah: భవిష్యత్తులో టీమ్ఇండియాలో కీలక బాధ్యతలు స్వీకరించాలని లిటిల్ మాస్టర్ సచిన్ తెందూల్కర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్న సచిన్.. భారత జట్టు అభివృద్ధి కోసం కూడా పనిచేయనున్నాడని ఇటీవల వార్తలు విస్తృతమయ్యాయి. ఈ నేపథ్యంలో జై షా ప్రయత్నానికి ప్రాధాన్యం ఏర్పడిందని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.
"ఏది సరైన విషయమో జై షాకు బాగా తెలుసు. రాహుల్ ద్రవిడ్‌ను హెడ్ కోచ్‌గా, వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎన్సీఏ అధ్యక్షుడిగా నియమించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సచిన్‌ను కూడా ఒప్పించేందుకు ఆయన పలు ప్రయత్నాలు చేస్తున్నారని మాకు తెలిసింది. భవిష్యత్తులో సచిన్ టీమ్ఇండియాలో కీలక పదవిని స్వీకరించవచ్చు." అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మాజీ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే భారత జట్టుకు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ కూడా కీలక పదవి స్వీకరించాలని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో 34 వేలకు పైగా పరుగులు చేసిన సచిన్.. అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
ఇదీ చూడండి: