Rohit Sharma World Cup 2023 : టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత వన్డే జట్టులో నాలుగో స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానాన్ని సమర్థవంతమైన బ్యాటర్‌తో భర్తీ చేయడం మేనేజ్మెంట్కు సవాలుగా మారిందనే చెప్పవచ్చు. నాలుగో స్థానంలో ఆడించేందుకు ఇప్పటికే అనేక మంది బ్యాటర్లను పరీక్షించింది మేనేజ్మెంట్. కానీ ఇప్పటికీ సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు కంటి కనిపించడం లేదు. ఇక ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రంగా కలవరపెడుతోంది.
అనేక ప్రయత్నాల తర్వాత జట్టు మేనేజ్మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక వారిని వీరిని కాకుండ.. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మనే నాలుగో స్థానంలో దింపాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. ఓపెనర్ బ్యాటర్‌గా ఇప్పటికే సూపర్ సక్సెస్ అయిన రోహిత్‌ను.. మిడిలార్డర్లో ఆడించి అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడేలా చూడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
KL Rahul Recovery : ఇక స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ లేదా శ్రేయస్ అయ్యర్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కోలుకుంటున్నారు. వీరు త్వరగా కోలుకొని ఫిట్నెస్ సాధిస్తే.. ఆసియా కప్‌లో ఆడే ఛాన్స్ఉంటుంది. కానీ అలా జరగకపోతే.. వీరిని నేరుగా ప్రపంచకప్‌నకు ఎంపిక చేసే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. అయితే శ్రేయస్ ఇప్పట్లో గాయం నుంచి కోలుకునే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు వేగంగా రికవరీ అవుతున్న రాహుల్.. ఆగస్టు 18న ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడట. ఈ టెస్ట్‌లో రాహుల్ పాసైతే.. ఆసియా కప్‌నకు అందుబాటులో ఉండటం ఖాయం. ఆ తర్వాత వరల్డ్‌కప్‌లోనూ రాహుల్ ఆడించి.. ఐదో నెంబర్లో పంపడానికి సన్నాహాలు చేస్తోందట.
ఒకవేళ వీరిలో ఏ ఒక్కరూ అందుబాటులోకి రాకపోతే.. నాలుగులో సంజూ శాంసన్‌ను కూడా ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. రీసెంట్గా విండీస్‌పై ఇదే స్థానంలో బరిలోకి దిగిన శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరోవైపు ఈ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను మేనేజ్మెంట్ ఇప్పటికే పలుమార్లు పరీక్షించింది. ఇక రోహిత్ మిడిలార్డర్లో వస్తే.. ప్రస్తుతం టీ20ల్లో ఓపెనింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ - ఇషాన్ కిషన్ జోడీని వన్డేల్లోనూ వన్డేల్లోనూ కొనసాగించాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా జట్టు కూర్పుపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Rohit sharma retirement news : 'అప్పటి వరకు ఆడాలని అనుకుంటున్నాను'
2023 odi world cup : బీసీసీఐ అలా అనుకుంటే పొరపాటే.. కనీసం ఇకనైనా..!