Rohit Sharma T20 World Cup 2024: 2023 వరల్డ్‌కప్ ఓటమి తర్వాత టీమ్ఇండియా 2024 పొట్టి ప్రపంచకప్ దక్కించుకోవడానికి కసిగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్గా అఫ్గానిస్థాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే వన్డే వరల్డ్‌కప్ ఓడిన టీమ్ఇండియాకు పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఓ మంచి అవకాశమని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
'వన్డే వరల్డ్‌కప్ ఓటమి గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. కానీ, నా దృష్టిలో 50 ఓవర్ల ప్రపంచకప్ క్రికెట్లో అతిపెద్ద టోర్నీ. అలా అని టీ20 వరల్డ్‌కప్, టెస్టు ఛాంపియన్‌షిప్ కీలకమైనవి కాదని నేను అనట్లేదు. నేను 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగా. అలాంటిది ఈ టోర్నీ భారత్‌లో జరగడం అనేది పెద్ద విషయం. ఫైనల్‌కు చేరుకున్నా దురదృష్టవశాత్తు కప్ గెలవలేకపోయాం. మాతోపాటు ఫ్యాన్స్ అందరూ ఎంతో బాధపడ్డారు. కానీ, మాకు టీ20 వరల్డ్‌కప్ రూపంలో ఇంకో అవకాశం ఉంది. ఈ టోర్నీలో కచ్చితంగా గెలుస్తామనే ధీమాతోనే బరిలోకి దిగుతాం' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
అఫ్గాన్‌తో ఆఖరి మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అయితే 'విరాట్ ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు చేయాలనే కసితో బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్‌లోనూ అలాగే కసితో ఉన్నాడు. కానీ డకౌట్ అయ్యాడు. కానీ, అతడికి డకౌట్ అనే పదం అస్సలు నచ్చదు. అలా ఔటైనప్పటికీ విరాట్ మైండ్ డైవర్ట్ కాదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా ఇలాగే వికెట్ పారేసుకున్నాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇలా జరిగింది' అని రోహిత్ అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, టీమ్ఇండియా సూపర్ ఓవర్లో 10 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 212 పరుగులు చేయగా, ఛేదనలో అఫ్గాన్ కూడా 212 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే సూపర్ ఓవర్ కూడా డ్రా అవ్వడం వల్ల, రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్లో భారత్ 11 పరుగులు చేయగా, అఫ్గాన్ 1 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌లో ఓటమి మూటగట్టుకుంది.
-
𝙇𝙤𝙫𝙚𝙙 𝙞𝙩! 👌 pic.twitter.com/WuA79E9YO7
— Rohit Sharma (@ImRo45) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝙇𝙤𝙫𝙚𝙙 𝙞𝙩! 👌 pic.twitter.com/WuA79E9YO7
— Rohit Sharma (@ImRo45) January 18, 2024𝙇𝙤𝙫𝙚𝙙 𝙞𝙩! 👌 pic.twitter.com/WuA79E9YO7
— Rohit Sharma (@ImRo45) January 18, 2024
సూపర్ ఓవర్లో రోహిత్ 'స్మార్ట్‌నెస్'- రూల్స్ ప్రకారం కరెక్టే!- కోచ్‌కు తెలియాలి కదా!