టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొంటానని ప్రకటించగానే.. మాజీలు, క్రికెట్ విశ్లేషకులు తర్వాతి కెప్టెన్ ఎవరు అవుతారా అనే దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జట్టులోని పలువురు ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు ఇస్తే బాగుంటుందని అన్నారు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాత్రం రోహిత్ శర్మను(rohit sharma ipl) కెప్టెన్ చేయాలని సూచించాడు. తర్వాతి రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో(t20 word cup 2021) టీమ్ఇండియాకు హిట్‌మ్యాన్ సారథిగా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. స్టార్‌స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్ట్డ్' కార్యక్రమంలో మాట్లాడుతూ గావస్కర్(gavaskar age).. ఈ వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కెప్టెన్సీ వదులుకుంటాడని ఇప్పటికే చెప్పేశాడు. అయితే ఆ బాధ్యతల్ని ఎవరికీ ఇస్తారనేది బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం రేసులో రోహిత్ శర్మ మాత్రమే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు సారథిగా ఉన్న అతడు.. ఐదుసార్లు ట్రోఫీ గెలిచాడు. దీంతో రోహిత్ శర్మనే, కోహ్లీ తర్వాత టీమ్ఇండియాకు సారథి అని అంటున్నారు.
మరోవైపు టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్(kl rahul gf), పంత్‌లలో(rishabh pant ipl) ఎవరో ఒకరికి ఇస్తే బాగుంటుందని గావస్కర్ అన్నాడు. ఐపీఎల్లో రాహుల్ పంజాబ్ కెప్టెన్‌గా, పంత్ దిల్లీ సారథిగా తమదైన మార్క్ చూపిస్తున్నారు.
ఇవీ చదవండి: