Rohit Sharma Paid Fine : భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ.. ఓవర్ స్పీడ్‌తో కారు నడిపినట్లు జరిగిన ప్రచారంపై హైవే పోలీసులు స్పందించారు. అందులో నిజం లేదని వెల్లడించారు. అతడి కారు గంటకు 215 కి.మీ స్పీడ్‌లో వెళ్లలేదని తెలిపారు. రోహిత్ కారు గంటకు 105 కి.మీ, 117 కి.మీ వేగంతో ప్రయాణించందని వెల్లడించారు.
Rohith Car Speed : దీంతో రోహిత్‌కు రూ.2000 చొప్పున రెండు సార్లు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఆ మొత్తాన్ని రోహిత్ గురువారమే చెల్లించేశాడని కూడా చెప్పారు. ముంబయి- పుణె హైవేపై వేగపరిమితి కేవలం గంటకు 100 కిలోమీటర్లు మాత్రమే అని వివరించారు.
"అక్టోబర్ 17వ తేదీన రోహిత్ కారు ముంబయి-పుణె మార్గంలో వేగపరిమితిని అతిక్రమించింది. చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకున్నాం. రోహిత్ కూడా వెంటనే జరిమానాలు చెల్లించాడు. అతడి కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించదన్న ప్రచారంలో నిజం లేదు. అత్యధికంగా అతడి కారు గంటకు 117 కిలోమీటర్ల వేగానికి చేరుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేకు ఇరువైపులా ఉన్న కెమెరాల్లో అతడి కారు ఫొటోలు కూడా నమోదయ్యాయి"
-- వాడ్‌గావ్ హైవే పోలీస్ అధికారి
ఆ ప్రయాణం వల్లే..
ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్.. అహ్మదాబాద్ నుంచి విమానంలో ముంబయి వెళ్లాడు. అక్కడ రెండు రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపిన అతడు.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కోసం పుణెకు చేరుకున్నాడు. అయితే తన లగ్జరీ లంబోర్గిని కారును నడుపుకుంటూ హిట్‌మ్యాన్ ముంబయి నుంచి నుంచి పుణె వెళ్లాడు. ఈ ప్రయాణం సమయంలో అతడికి జరిమానా విధించారు పోలీసులు.
ముంబయి-పుణె జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని గమనించడానికి ఆటోమేటెడ్ కెమెరాలను అమర్చారు అధికారులు. వేగపరిమితిని దాటిన వాహనాల నంబర్లను గుర్తించి వీటికి సిస్టమే ట్రాఫిక్ చలాన్లను జారీ చేస్తుంది. తాజాగా రోహిత్ కారు మితిమీరిన వేగంతో వెళ్లినట్లు ప్రచారం జరగడం వల్ల అతడి అభిమానులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులు స్పందించి క్లారిటీ ఇచ్చారు.
KL Rahul World Cup 2023 : 'విరాట్ వద్దనుకున్నాడు.. కానీ నేనే అతడికి అలా చెప్పాను'
BCCI Team India : రోహిత్ సేనకు విశ్రాంతి.. బీసీసీఐ స్పెషల్ పర్మిషన్!