ETV Bharat / sports

Rohit Sharma News: భార్య పేరిట ఖరీదైన స్థలం కొన్న రోహిత్‌ శర్మ - Rohit Sharma buys 4 acre land

Rohit Sharma News: టీమ్​ఇండియా నూతన సారథి రోహిత్ శర్మ తన భార్య రితికా పేరిట భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని దక్షిణ అలీబాగ్‌లో రూ.9 కోట్లతో నాలుగు ఎకరాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.

Rohit Sharma News
రోహిత్​
author img

By

Published : Dec 17, 2021, 5:33 AM IST

Rohit Sharma News: టీమ్‌ఇండియా కెప్టెన్‌ ప్రమోషన్‌ పొందిన రోహిత్ శర్మ మంచి జోష్‌ మీదున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి కెప్టెన్‌గా మంచి ఆరంభం అందుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు వైస్‌ కెప్టెన్‌గాను ఎంపికయ్యాడు. ఈ సంతోషకరమైన సందర్భంలో హిట్‌మ్యాన్‌ తన భార్య రితికా పేరిట భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని దక్షిణ అలీబాగ్‌లో రూ.9 కోట్లతో నాలుగు ఎకరాలను కొనుగోలు చేశాడట. దీనికి సంబంధించిన ఈ నెల 14న రిజిస్ట్రేష‌న్ కూడా పూర్త‌యినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన భూమి.. అలీబాగ్ న‌గ‌రానికి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సరళ్‌ మహాత్రోలి అనే గ్రామంలో ఉంటుంది.

Rohit Sharma Updates:

"భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కోసం రోహిత్ శర్మ మా కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమే. కానీ, అతడు భూమిని కొన్నాడా లేదా అతడితో పాటు ఉన్న వ్యక్తి కొనుగోలు చేశాడా అన్నది మాకు తెలియదు" అలీబాగ్‌ సబ్ రిజిస్టర్ సంజాన జాదవ్‌ పేర్కొన్నారు. అదే విధంగా ఆ గ్రామ సర్పంచ్‌ అమిత్ నాయక్‌ మాట్లాడూతూ.. "రోహిత్‌ శర్మ తన భార్య పేరిట 4ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. దాని విలువ సూమారు రూ.9 కోట్లు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆ తరువాత మా గ్రామానికి వచ్చి ఆ స్ధలంలో పూజ కూడా నిర్వహించారు" అని పేర్కొన్నాడు.

సచిన్‌, కోహ్లిలకు కూడా

క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెందూల్కర్‌లతోపాటు టీమ్‌ఇండియా టెస్ట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా అలీబాగ్‌లో భూములున్నాయి. అజిత్ అగార్క‌ర్‌, ర‌విశాస్త్రి కూడా ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. అలీబాగ్‌ సుందరమైన ప్రాంతాల‌లో ఒక‌టిగా పేరుగాంచింది. పర్యాటక ప్రదేశం కూడా. మరోవైపు, మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: Ashes 2nd test 2021: అండర్సన్​,​ బ్రాడ్​ సరికొత్త రికార్డులు​

IND vs SA 2021: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్​ఇండియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.