ETV Bharat / sports

'రోహిత్​.. ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ ఆటగాడు'

author img

By

Published : Jul 11, 2021, 4:20 PM IST

అన్ని ఫార్మాట్లలో టీమ్​ ఇండియా ఓపెనర్​గా ఉన్న.. రోహిత్​ శర్మపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న ఇంగ్లాండ్​ సిరీస్​లో రాణిస్తాడని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రపంచంలోనే రోహిత్​ అత్యుత్తమ ఆటగాడు అని కొనియాడాడు టీమ్​ ఇండియా మాజీ ప్లేయర్ రీతిందర్​ సింగ్​​.

Rohit Sharma
రోహిత్

రోహిత్​ శర్మ ఓపెనర్​గా ఒక్కసారి కుదురుకుంటే.. మ్యాచ్​ ప్రత్యర్థి చేతుల్లోంచి చేజారినట్లేనని అభిప్రాయపడ్డాడు టీమ్​ ఇండియా మాజీ క్రికెటర్​ రీతిందర్​ సింగ్​ సోధి. 'హిట్​ మ్యాన్​.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు' అని పొగడ్తలతో ముంచెత్తాడు. కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​లో విరాట్, పుజారాలతో పాటు రోహిత్​ శర్మ బ్యాటింగ్​ కీలకంగా మారనుందని అన్నాడు.

ఓపెనర్​గా వచ్చి.. అదరగొట్టి..

2013లో టీమ్​ ఇండియా టెస్టు జట్టులోకి వచ్చిన రోహిత్​ శర్మ.. వెస్టిండీస్​పై రెండు వరుస సెంచరీలతో అదరగొట్టాడు. ఆ తర్వాత.. రెగ్యులర్​గా టెస్టు జట్టులో లేకపోయినా 2019 నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ ఏడాది ఓపెనర్​గా కొత్త అవతారమెత్తి.. భారత్​కు మంచి శుభారంభాలనందించాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​లోనూ మంచి ప్రదర్శన చేశాడు. టీమ్​ ఇండియా ఫైనల్​కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్​పై సౌథాంప్టన్​లో జరిగిన ఫైనల్లోనూ రెండు ఇన్నింగ్స్​లో వరుసగా 34, 30 పరుగులు చేశాడు.

''రోహిత్​.. టెస్టు క్రికెట్లో ఇబ్బందులు పడతాడని మేం తొలుత అనుకున్నాం. కానీ.. ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతడిలో ఓ ప్రత్యేకత ఉంది. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్​ను లాగేసుకోగలడు'' అని రీతిందర్​ సోధి తెలిపాడు.

ఇప్పటివరకు కెరీర్​లో 39 టెస్టులాడిన రోహిత్​.. 46.19 సగటుతో 2679 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 12 హాఫ్​సెంచరీలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ధోనీ కంటతడి- కోట్లాదిమంది హృదయాలు ముక్కలైన వేళ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.