Rohithsharma record: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించడంతో ఈ ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా 13 విజయాలను సాధించిన తొలి కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.
రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకను వరుసగా క్లీన్‌స్వీప్ చేసింది టీమ్ఇండియా. ఇప్పుడు తాజాగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. టీ20 ప్రపంచకప్ దగ్గర పడుతున్న వేళ ఇది టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. కాగా, ఈ మ్యాచ్‌లో హార్దిక్(50), రోహిత్(24), సూర్యకుమార్ యాదవ్(39), దీపిక్ హూడా(33) బాగా రాణించారు. దీంతో భారత జట్టు 50 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తేడాతో లీడ్ సాధించింది.
ఇదీ చూడండి: విండీస్‌తో టీ20లకూ విరాట్ దూరం.. పంత్, బుమ్రా, హార్దిక్ అనుమానమే!