Road Safety World Series: అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు బరిలో దిగే 'రోడ్డు భద్రత ప్రపంచ సిరీస్' టోర్నీ రెండో సీజన్‌కు లైన్ క్లియరైంది. మే నెలాఖరులో టోర్నీ ప్రారంభం కానుందని నిర్వహకులు ప్రకటించారు. నిజానికి ఈ టోర్నీ ఈ నెలలోనే జరగాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడింది. హైదరాబాద్, విశాఖపట్నం, లఖ్‌నవూ, ఇండోర్ వేదికలుగా మ్యాచ్‌లు జరగుతాయని.. జూన్‌లో హైదరాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది. త్వరలోనే మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని నిర్వహకులు స్పష్టం చేశారు.
బాకీలు క్లియర్..
రోడ్ సేఫ్టీ సిరీస్ మొదటి సీజన్లో పాల్గొన్న బంగ్లాదేశ్ ఆటగాళ్లకు నిర్వహకులు ఇంకా ఫీజు చెల్లించకపోవడంపై ఆటగాళ్లకు అసంతృప్తితో ఉన్నట్లు అక్కడి మీడియా ఇటీవల వెల్లడించింది. అయితే మాజీ ఆటగాడు రజిన్ సాలేహ్ విడుదల చేసిన వీడియోతో ఈ సమస్య పరిష్కారమైనట్లు తెలుస్తోంది. నిర్వహకులు తనకు బాకీ ఉన్న ఫీజును చెల్లించారని ఆ వీడియోలో అతడు పేర్కొన్నాడు. అవకాశం వస్తే ఈ టోర్నీలో ఈసారి ఆడేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు.
ఈ సిరీస్‌లో భారత్ సహా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటాయి.
ఇదీ చూడండి : IPL: 'మహీ విశ్వాసాన్ని రైనా కోల్పోయాడు.. అందుకే అలా'