Rinku Singh Birthday : టీమ్ఇండియా యువ సంచలనం రింకూ సింగ్.. 2023 ఐపీఎల్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రింకూ.. ఆ మ్యాచ్ ఛేదనలో వరుసగా 5 సిక్స్‌లు బాది.. ఔరా అనిపించాడు. ఆ తర్వాత కూడా ఐపీఎల్‌లోనే అనేక మ్యాచ్‌ల్లో రాణించి.. తన ఇన్నింగ్స్ గాలివాటం కాదని నిరూపించుకున్నాడు. అక్టోబర్ 12 గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఐపీఎల్ నుంచి ఆసియా గేమ్స్ వరకూ వెళ్లిన రింకూ సక్సెస్ గురించి తెలుసుకుందాం.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రింకూ.. 2014లో లిస్ట్ ఏ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 83 పరుగులు చేసిన రింకూ.. స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత 2016లో ఉత్తర్‌ప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసి.. జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత విజయ్ హరారే ట్రోఫీలో త్రిఫురపై 44 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. 2018-19 రంజీ ట్రోఫీలోనూ రాణించి.. 105 సగటుతో 953 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత నింబంధనలకు విరుద్ధంగా.. విదేశీ లీగ్‌లో ఆడిన కారణంగా రింకూను.. బీసీసీఐ 3 నెలలు సస్పెండ్ చేసింది.
ఐపీఎల్లో ఇలా.. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన రింకూను.. 2017 వేలంలో కింగ్స్ లెవన్ పంజాబ్ (ఇప్పుడు.. పంజాబ్ కింగ్స్) రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో అతడికి బరిలో దిగే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్.. అతడ్ని ఏకంగా రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అప్పుడు కూడా రింకూకు అడపాదడపా ఛాన్స్‌లే వచ్చాయి.
లైఫ్ మార్చిన ఇన్నింగ్స్.. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూయయ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. చివరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 29 పరగులు కావాలి. ఇక కోల్‌కతా ఓటమి లాంఛనమే అనుకున్న సమయంలో.. రింకూ అనూహ్యంగా 5 బంతుల్లో వరుసగా 5 సిక్స్‌లు బాది గుజరాత్ నుంచి గెలుపును లాగేసుకున్నాడు. దీంతో ఆ ఒక్క ఇన్నింగ్స్‌తోనే రింకూ హీరో అయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత కూడా అతడు ఇదే జోరు కొనసాగిస్తూ.. 474 పరుగులు చేశాడు.
దీంతో ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో వచ్చిన ఛాన్స్‌ను రింకూ.. సద్వినియోగం చేసుకున్నాడు. రెండో టీ20లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి ప్లేయర్ 'ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఈ ఏడాది చైనా హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌కు వెళ్లె టీమ్ఇండియా జట్టులోనూ ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో టీమ్ఇండియా గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
Rinku Singh KBC : 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో రింకు సింగ్‌పై ప్రశ్న.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?