ETV Bharat / sports

'కోచ్​ పదవికి ద్రవిడ్ ఓకే చెప్పడం ఆశ్చర్యమే' - రాహుల్ ద్రవిడ్

టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ పదవికి రాహుల్ ద్రవిడ్(rahul dravid coach) అంగీకారం తెలపడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(ricky ponting news). తనకు కూడా చీఫ్​ కోచ్​ పదవి కోసం​ ఆఫర్​ వచ్చినట్లు పేర్కొన్నాడు.

ricky ponting
రికీ పాంటింగ్
author img

By

Published : Nov 19, 2021, 6:50 AM IST

భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవిని చేపట్టడానికి రాహుల్‌ ద్రవిడ్‌(rahul dravid head coach) అంగీకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(ricky ponting news) అన్నాడు. "భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవిని రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించడం ఆశ్చర్యానికి గురి చేసింది. భారత అండర్‌-19 కోచ్‌గా అతడెంత ఆనందంగా ఉండేవాడో నాకు తెలుసు. అతడి కుటుంబం గురించి తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారని అనుకుంటున్నా. అయినా అతడు కోచ్‌ పదవి చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది. తమకు సరైన వ్యక్తి దొరికాడని కొందరు చెప్పడాన్ని బట్టి.. పదవి చేపట్టేలా వారు ద్రవిడ్‌ను ఒప్పించి ఉండొచ్చు" అని రికీ తెలిపాడు.

టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌గా ఉండాలని తనను సంప్రదించారని కానీ తాను అంగీకరించలేదని పాంటింగ్‌ తెలిపాడు. "టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ ప్రతిపాదనతో నా వద్దకు కొందరు వచ్చారు. ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నించారు. అంత సమయం కేటాయించలేనని వారితో చెప్పాను" అని పాంటింగ్‌ అన్నాడు. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు రికీ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇదీ చదవండి:

IND vs NZ: 'కోహ్లీ తిరిగొచ్చినా.. మూడో స్థానంలో అతడే ఆడాలి'

అశ్విన్​ బౌలింగ్​ను ఎదుర్కోవడం చాలా కష్టం: గప్తిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.