ETV Bharat / sports

టీమ్​ ఇండియా టెస్టు కెప్టెన్​గా అతడి పేరే ఖరారు! - team india captain

India New Test Captain: భారత క్రికెట్​ జట్టు పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్​గా కూడా రోహిత్​ శర్మనే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Rohit Sharma likely to be appointed Indias Test captain

author img

By

Published : Feb 8, 2022, 7:26 PM IST

India New Test Captain: టీమ్​ఇండియా వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న రోహిత్​ శర్మనే.. పూర్తిస్థాయి టెస్టు సారథి బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఇప్పటికే అతడి పేరు ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

2 టెస్టులు, 3 టీ-20ల సిరీస్​ కోసం శ్రీలంక.. భారత్​కు రానుంది. ఫిబ్రవరి 24న టీ-20లతో పర్యటన ప్రారంభం కానుంది. లంకతో టెస్టు సిరీస్​ కంటే ముందే.. ఛేతన్​ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్​ కమిటీ కెప్టెన్​గా రోహిత్​ పేరును ప్రకటించనుందని తెలుస్తోంది.

ఇటీవల సౌతాఫ్రికా చేతిలో 1-2 తేడాతో టీమ్​ఇండియా టెస్టు సిరీస్​ కోల్పోయిన అనంతరం.. సారథిగా వైదొలిగాడు విరాట్​ కోహ్లీ. అప్పటినుంచి ఈ పోస్ట్​ ఖాళీగా ఉంది. వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న రోహితే.. టెస్టు కెప్టెన్​ అవుతాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే.. మధ్యలో పంత్​, బుమ్రా, కేఎల్​ రాహుల్​ పేర్లు కూడా వినిపించాయి. కానీ.. సెలక్టర్లు రోహిత్​ వైపే మొగ్గినట్లు క్రికెట్​ పండితులు చెబుతున్నారు.

శ్రీలంకతో షెడ్యూల్​ ఇది..

ఫిబ్రవరి 24- తొలి టీ-20 (లఖ్​నవూ)

ఫిబ్రవరి 26- రెండో టీ-20 (ధర్మశాల)

ఫిబ్రవరి 27- మూడో టీ-20 (ధర్మశాల)

టెస్టు సిరీస్​ మార్చి 3న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 3-7 మధ్య తొలి టెస్టు పంజాబ్​లోని మొహలీ వేదికగా, రెండో టెస్టు మార్చి 12-16 మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే అవకాశాలున్నాయి.

మొహలీ టెస్టు మాజీ సారథి విరాట్​ కోహ్లీకి వందో టెస్టు. తొలుత తన వందో టెస్టును బెంగళూరులో నిర్వహించనున్నట్లు తెలియగా.. సిరీస్​లో మార్పుల అనంతరం మొహలీకి మారింది. ఈ షెడ్యూల్​పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇవీ చూడండి: ఇకపై ఇది 'టాటా ఐపీఎల్'.. వేలం తేదీలపై అధికారిక ప్రకటన

IPL 2022 Auction: ఐదు సార్లు ఛాంపియన్​- మళ్లీ వీళ్లను తీసుకుంటుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.