RCB New Head Coach 2024 : ఐపీఎల్ స్టార్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక మార్పు చేసింది. జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ను జట్టు హెడ్‌కోచ్‌గా నియమించినట్లు తెలిపింది. కాగా ఇదివరకు టీమ్ హెడ్‌కోచ్‌గా కొనసాగిన సంజయ్ బాంగర్ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ఆండీ ఫ్లవర్‌కు క్యాప్ ఇచ్చి టీమ్‌లోకి స్వాగతించింది జట్టు యాజమాన్యం.
"ఐసీసీ ఆల్ హాఫ్ ఫేమర్, టీ20 ప్రపంచకప్ విజేత అండీ ఫ్లవర్‌ను ఆర్సీబీ పురుషుల జట్టు హెడ్‌కోచ్‌గా నియమించాము. ఆండీకు ప్రపంచ వ్యాప్తంగా టీ20 జట్లకు, ఐపీఎల్లో కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అబుదాబి టీ10, పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్), ఐఎల్ (ఇంటర్నేషనల్ టీ20 లీగ్) గెలిచిన అతడి అనుభవం ఆర్సీబీని ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడుతుంది" అని ఆర్సీబీ యాజమాన్యం ట్వీట్ చేసింది.
-
𝑨𝒔 𝒕𝒉𝒆𝒊𝒓 𝒕𝒆𝒓𝒎 𝒆𝒏𝒅𝒔, 𝒘𝒆 𝒘𝒊𝒔𝒉 𝑴𝒊𝒌𝒆 𝒂𝒏𝒅 𝑺𝒂𝒏𝒋𝒂𝒚 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒗𝒆𝒓𝒚 𝒃𝒆𝒔𝒕 𝒊𝒏 𝒍𝒊𝒇𝒆. :heart:#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/zI4r1kMZ2c
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝑨𝒔 𝒕𝒉𝒆𝒊𝒓 𝒕𝒆𝒓𝒎 𝒆𝒏𝒅𝒔, 𝒘𝒆 𝒘𝒊𝒔𝒉 𝑴𝒊𝒌𝒆 𝒂𝒏𝒅 𝑺𝒂𝒏𝒋𝒂𝒚 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒗𝒆𝒓𝒚 𝒃𝒆𝒔𝒕 𝒊𝒏 𝒍𝒊𝒇𝒆. :heart:#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/zI4r1kMZ2c
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023𝑨𝒔 𝒕𝒉𝒆𝒊𝒓 𝒕𝒆𝒓𝒎 𝒆𝒏𝒅𝒔, 𝒘𝒆 𝒘𝒊𝒔𝒉 𝑴𝒊𝒌𝒆 𝒂𝒏𝒅 𝑺𝒂𝒏𝒋𝒂𝒚 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒗𝒆𝒓𝒚 𝒃𝒆𝒔𝒕 𝒊𝒏 𝒍𝒊𝒇𝒆. :heart:#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/zI4r1kMZ2c
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023
కాగా ఇప్పటివరకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన భంగర్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హస్సెన్ భవిష్యత్ కెరీర్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ వారికి ఉద్వాసన పలికింది. కోచ్‌గా నియమితులైన అండీ.. " రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో చేరుతున్నందుకు గర్వంగా ఉంది. ఆర్సీబీకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఆ వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నా" అని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
-
The feeling is mutual, Gaffer! :handshake:
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We can't wait to get #IPL2024 prep underway! :heart_on_fire:#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/av7fEPh4zz
">The feeling is mutual, Gaffer! :handshake:
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023
We can't wait to get #IPL2024 prep underway! :heart_on_fire:#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/av7fEPh4zzThe feeling is mutual, Gaffer! :handshake:
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023
We can't wait to get #IPL2024 prep underway! :heart_on_fire:#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/av7fEPh4zz
Andy Flower Coaching Career : అండీ ఫ్లవర్ 2010 టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్లో గతరెండు సీజన్లుగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. రానున్న సీజన్‌కు ముందు లఖ్‌నవూ అతడిని వదులుకుంది. దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ అండీని తమ జట్టులోకి స్వాగతించింది.
Rcb IPL Journey : 2008 నుంచి ఆర్సీబీ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉంది. గత 16 సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ గెలవడం ఆర్సీబీకి కలగానే ఉండిపోయింది. 2023 సీజన్‌ను ఘనంగానే ఆరంభించినప్పటికీ.. లీగ్ సెకండ్ హాఫ్‌లో డీలాపడింది. దీంతో మిలియన్ల కొద్దీ ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. కాగా, 2009, 2011, 2016 సీజన్లలోనే ఆర్సీబీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మరి ఈసారైనా కొత్తకోచ్ ఆర్సీబీకి టైటిల్ సాధిస్తాడో లేదో చూడాలి.