Pant offers champagne bottle Ravisastri: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడే వన్డేలో విజయం సాధించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్‌ను 2-1తేడాతో సొంతం చేసుకుంది. హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ ప్రదర్శన, పంత్ ధనాధన్ ఇన్నింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 115 బంతుల్లో 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం పాండ్య ఔట్ అయినప్పటికీ.. పంత్ మాత్రం ఆఖరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో అతడి అద్భుత ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దీంతో పాటే అవార్డు ప్రజెంటేషన్ సమయంలో నగదుతో పాటు షాంపైన్ బాటిల్‌ను కూడా అందజేశారు. అయితే ఆ షాంపైన్ బాటిల్‌ను అందుకున్న పంత్.. ఎవరూ ఊహించని పని చేశాడు.
ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత్ మాజీ హెట్ కోచ్ రవిశాస్త్రిపై తన అభిమానాన్ని చాటుతూ.. షాంపైన్ బాటిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ సమయంలో స్డేడియం ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే పంత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలానే తన తొలి దశలో అతడు విఫలమైనప్పటికీ.. చాలా సందర్భాల్లో రవిశాస్త్రి పంత్‌కు అండగా నిలిచాడు. కాగా, ఈమ్యాచ్‌లో టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియా.. 42.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: పంత్, హార్దిక్ ధనాధన్ ఇన్నింగ్స్.. టీమ్ఇండియాదే సిరీస్