Jadeja counter KKR: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు ఆదివారం డ్రాగా ముగిసింది. చివరి క్షణాల్లో ఇంగ్లాండ్ ఆఖరి వికెట్ కాపాడుకొని ఈ మ్యాచ్‌లో ఓటమిపాలవ్వకుండా గట్టెక్కింది. అదే సమయంలో ఆసీస్ కూడా ఇంగ్లాండ్ టెయిలెండర్లను ఔట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఫీల్డర్లు అందరినీ బ్యాట్స్‌మెన్ చుట్టూనే ఏర్పాటు చేశాడు. దీంతో ఎలాగైనా ఆ ఒక్క వికెట్ సాధించి నాలుగో టెస్టును కైవసం చేసుకోవాలని చూశాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలమై ఇంగ్లాండ్ ఊపిరిపీల్చుకుంది. ఐపీఎల్‌లో కూడా ఒకసారి కోల్‌కతా నైటరైడర్స్.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ బ్యాటర్ ధోనీ కోసం ఇదే ఫీల్డింగ్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా యాషెస్‌తో పాటు ఐపీఎల్‌లోని ఆ సన్నివేశాన్ని ట్విట్టర్లో పంచుకుంది కేకేఆర్. దానికి సీఎస్కే స్పిన్నర్ రవీంద్ర జడేజా గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఏం జరిగింది?
ఐపీఎల్‌లో ఒకసారి గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున బ్యాటింగ్ చేస్తున్న ధోనీకి అచ్చం ఇలాంటి ఫీల్డింగే ఏర్పాటు చేశాడు. ధోనీ డిఫెన్స్‌ను కట్టడి చేయాలని చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించాడు. యాషెస్ నాలుగో టెస్టులోని మ్యాచ్‌లోని ఈ సన్నివేశం.. కేకేఆర్ జట్టుకు ఒకప్పటి గంభీర్ చర్యను గుర్తుకు చేసింది. దీంతో నాటి ధోనీ ఫొటోతో సహా తాజా మ్యాచ్‌లోని ఆండర్సన్‌కు ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది కేకేఆర్. "టెస్టుల్లో క్లాసిక్ సన్నివేశం.. మీకు టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తు చేస్తే ఇలా ఉంటుంది" అని పోస్టు చేసింది. ఇది చూసిన చెన్నై ఆల్‌రౌండర్ జడేజా తనదైనశైలిలో స్పందించాడు. అది మాస్టర్ స్ట్రోక్ కాదు. కేవలం షో ఆఫ్ అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు.
-
Its not a master stroke!Just a show off🤣
— Ravindrasinh jadeja (@imjadeja) January 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Its not a master stroke!Just a show off🤣
— Ravindrasinh jadeja (@imjadeja) January 9, 2022Its not a master stroke!Just a show off🤣
— Ravindrasinh jadeja (@imjadeja) January 9, 2022
పలువురు ధోనీ అభిమానులు కూడా కేకేఆర్ టీమ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు పోస్టులు మీమ్స్ షేర్ చేస్తూ కేకేఆర్‌ను ఆటపట్టిస్తున్నారు. కాగా, ఈ రెండు జట్లూ గతేడాది ఐపీఎల్ ఫైనల్లో చివరిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగులతో గెలుపొంది నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై టీమ్ ఐపీఎల్ 2022కు జడేజాను అట్టిపెట్టుకుంది. కెప్టెన్ ధోనీ, రుతురాజ్, మొయిన్ అలీలను కూడా ఆ జట్టు తమ వద్దే పెట్టుకోవడం గమనార్హం.